Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ కార్పొరేషన్ ప్రజావాణి కా ర్యక్రమానికి వచ్చిన వినతిదారుల సమ స్యలు పరిష్కారం కావట్లేదని బాధి తులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కా ర్పొరేషన్ కమిషనర్ కలెక్టర్‌గా పదో న్నతి పొంది వరంగల్ జిల్లాకు కలెక్టర్ బ దిలీ అయినప్పటినుండి నేటి వరకు కా ర్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు కూడా ఇన్చార్జిగా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుండి నేటి వరకు పూర్తిస్థాయి కమిష నర్ కార్పొరేషన్‌కు లేకపోయేసరికి సమస్యలు పేరుకపోతున్నాయని పలువురు చర్చించు కుంటు న్నారు. ఇప్ప టికైనా ఉన్నత అధికారులు స్పందించి పూర్తిస్థాయి వరంగల్ కార్పొరేషన్ కు పూర్తిస్థాయి కమిషనర్ ను నియమిం చాలని అప్పుడే సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు ముందుకు పడుతాయని పలువురు అనుకుంటు న్నారు.వరంగల్ మండలం ఎనుమాముల గ్రామ శివారు ఎస్సార్ నగర్ లో 180 ప్రభుత్వ భూమిని ఆరెకరం కబ్జా చేశారని ప్రభుత్వ భూమిని కాపాడాలని కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. కాశి కుంట హిందూ ఆరకటిక స్మశాన వాటిక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, రామన్నపేటలో నల్ల నీటిలో మురుగునీరు కలిసి తాగునీ రు దుర్వాసన వెదజల్లుతుందని ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజలు ఫిర్యాదులను అందజేశారు.