Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా ఓరుగల్లు నగరానికి స్మార్ట్ సిటీలో భాగంగా నిధుల ను మంజూరు చేసింది. ఈ నిధులను సక్రమంగా వి నియోగించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అభి వృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రచించాల్సిన స్మార్ట్ సిటీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజ నీరింగ్ అధికారులు, ప్రణాళికలోపం కారణంగా ల క్షల రూపాయల ప్రజల సొమ్మువృథా అయిన పరిస్థి తి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొట్టొచ్చి నట్టు కనిపిస్తుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా 25వ డివి జన్ మండి బజారు నుండి 27, 28వ డివిజన్లలో రై ల్వేస్టేషన్ వరకు నిర్మించిన 60 ఫీట్ల సిసి రోడ్డు నిర్మా ణం చేసిన అధికారులు రోడ్డు మధ్యలో డివైడర్లు కో సం కాంక్రీట్ సిమెంట్‌తో పోసి చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ వరకు రాళ్లతో డివైడర్‌ను కట్టారు. తీరా ట్రాఫి క్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపంతో మండి బజార్ నుండి స్టేషన్‌రోడ్డు వరకు నిర్మించిన డివైడ ర్ను జేసీబీలతో తొలగిస్తున్నారు.
అధికారుల 'మహా' నిర్లక్ష్యం...
ఏదైనా అభివృద్ధి పనులు నిర్మించే ముందే ఇ బ్బందులపై దృష్టి సారించి నిబంధనల అనుసారం రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అధికారులు అవేవీ ప ట్టించుకోకుండా మండిబజార్ నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డునిర్మాణ పనులను చేపట్టారు. అరవై ఫీట్లతో ఉన్న ఈరహదారిలో ఎటువంటి రోడ్డు వైన్డింగ్ చేయ లేదు. అలాంటప్పుడు ఉన్న రోడ్డులో డివైడర్ నిర్మిం చి లైటింగ్ సిస్టం పెట్టితే మూడు ఫీట్ల మేర స్థలం పోతున్న విషయం ఇంజనీరింగ్ అధికారులకు తెలి యంది కాదు. అయినప్పటికీ ఇరువైపులా సీసీ నిర్మా ణం చేసి మధ్యలో డివైడర్లు కట్టేశారు. దీంతో రోడ్డు నిర్మాణం అయినప్పటి నుండి అటువైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సు లు తిరిగే వెసులుబాటు లేక ఆ రూట్లో బస్సు లు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. మండి బజా ర్లో ఉన్న బిరియాని హౌటల్లో ముందు నిలిచే వాహ నాలతో ట్రాఫిక్కుతీవ్రఅంతరాయం ఏర్పడుతూ నే ఉంది.ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు ఫి ర్యాదులు వెళ్లడంతో డివైడర్‌ను తొలగించి ఆ స్థానం లో మళ్లీ సిసి నింపే పనిని అధికారులు చేపట్టారు. ఏది ఏమైనాప్పటికీ కట్టుడు కూల్చడం వల్ల అం తిమంగా నష్టపోయేది ప్రజల సొమ్మే అనే విషయాన్ని అధికారులుతెలుసుకోకపోవడం బాధాకరమన్నారు.