Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
ఏఐసిసి,టిపిసిసి ఆదేశాల మేరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్ల మెంట్లో ఎంపీగా అనర్హత వేటు వేసిన అంశంపైన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష నిర్వహించడం జరిగింది. దేశంలో ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని, నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని తెలిపారు. మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ ను అడ్డుకున్నారని గుర్తు చేశారు.డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆదానీ-ప్రధాని అని విమర్శించారు. ఆదానీ ఇంజన్ కు రిపేరు వచ్చిందని ప్రధానికి భయం పట్టుకుందన్నారు. ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయందోలనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారు.ప్రధానమంత్రి, కేబినేట్ మంత్రులు, మొత్తం వ్యవస్థ కలిసి ఒక వ్యక్తిని కాపాడటానికి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తున్నరనేది ప్రజలు ఆలోచించాలి పప్పు అని అవహేళన చేసిన బీజేపీకి రాహుల్ నిప్పు అనితెలుసుకున్నారని.అందుకేరాజకీయకక్షతోరాహుల్అడ్డుతొలగించుకోవాలనుకున్నారని ఆరోపించారు. ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్‌గాంధీని చూసి మోదీ ఎంత భయపడు తున్నారో అర్ధమవుతోందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్, పిసిసి సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకష్ణ, డివిజన్ అద్యక్షులు, మండల పార్టీ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.