Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-రాయపర్తి
ప్రజా సంక్షేమమే శ్వాసగా గ్రామాల అభివద్ధి ధ్యాసగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాలనను కొనసాగిస్తున్న అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవా రం మండలంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాల లో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగాని ర్మిం చిన నూతన భవనాలను ప్రారంభించారు, తదుపరి పెర్కవేడు గ్రామపరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మా ణానికి భూమిపూజ చేశారు. జిపి భవనాన్ని ప్రారంభించారు. పెర్కవే డు, రాయపర్తి, తీర్మాలా యపల్లి, కాట్రపల్లి గ్రా మాల్లో శ్రీనిధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణలో ప్రావీణ్యులైన మహిళలకు ఉచితకుట్టు మిషన్లు పం పిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు పాఠశాల జి ల్లాలోని నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పాఠ శాలలో రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నట్లు తెలిపారు. గతంలో సర్కాలు బడులు అంటే చులకన ఉండేదని సరైన తరగదు గదులు, బాత్రూం లు లేక సరైన వసతులు లేక దయనీయంగా ఉం డేదని కానీ కెసిఆర్ నాయకత్వంలో సర్కారు బడులు అంటే కానీ విని ఎరుగని రీతిలో కార్పొరేట్ స్థాయిని మించి అభివృద్ధి చెందాయని అది స్పష్టంగా కనిపి స్తుందని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని ప్రతిబిడ్డ స ర్కార్ బడుల్లోనే విద్యను అభ్యసించాలని కోరారు. వంటగదులకే పరిమితమైనమహిళలకు స్వేచ్ఛ స్వా తంత్య్రం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొని యాడారు. కెసిఆర్ మహిళల సంఘాలకు వడ్డీ లేని రుణాలను కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పెద్దన్నగా తోడ్పాటు అందించాడని వివరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్విని వకాడేతానాజీ, డిఆర్డీఓ సంపత్‌రావు, డీపీఓ కల్పన, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగుకుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీ ఓ కిషన్, ఎర్రబెల్లి ట్రస్ట్ కోఆర్డినేటర్ పంజా కల్పన, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, మం డల అధ్యక్షుడు నరసింహనాయక్, సర్పంచులు కంది కట్లస్వామి, తారశ్రీరాజబాబు,గారేనర్సయ్య, అనంత ప్రసాద్, బోనగిరి ఎల్లయ్య, ఎంపీటీసీ లు రాదమ్మ రాజయ్య, అనూష రాజబాబు, రాధిక సుభాష్‌రెడ్డి, రాంచందర్, సంధ్య సోమనాధంలు పాల్గొన్నారు.