Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భా గంగా మండలంలో భూములు కోల్పోతున్న భూ నిర్వా సితులకు ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లిం చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు భాగం లోకేశ్వరావులు డి మాండ్‌చేశారు.పుల్లూరు, బుద్దారం రెవెన్యూ గ్రా మాలలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరి హారాన్ని చెల్లించాలని సోమవారం జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో జాయిం ట్ కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతి పత్రం అం దించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి చెందిన ఈ రెండు రెవెన్యూ పంచా యతీలతో పాటు, డోర్నకల్‌కు చెందిన భూనిర్వా సితులు 129 మందికి గాను కేవలం పది మంది కి మాత్రమే నష్ట పరిహారం చెల్లించడం జరిగిం దని తెలిపారు.రెండు సంవత్సరాల క్రితం ప్రభు త్వ అధికారులు భూ నిర్వసి తులకు ఒక్కో ఎకరా నికి పదిన్నర లక్షల రూపాయల చొప్పున నష్టపరి హారాన్ని 20 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చార ని రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వెలిబుచ్చా రు. సాగు భూములకు అధిక ధరలు ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారుల సూచనలతో తక్కువ ధరలకే సా గు భూములు కాలువ నిర్మాణానికి ఇచ్చామని అటు తమ భూములలో పంటలు సాగు చేసుకు నే అవకాశం లేక ఇటు ప్రభుత్వం నుండి చెల్లిస్తా మని హామీ ఇచ్చిన నష్టపరిహారం రాక ఆర్థిక ఇ బ్బందులు పడుతున్నామని వాపోయారు. భూ ములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక వాంకు డోత్ శ్రీను, వాంకుడోత్ చిన్ని అనే ఇద్దరు రైతులు చనిపోయారని కనీసం వారికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుండి రాలేదని అందోళన వ్య క్తం చేశారు. అధికారులు స్పందించి భూ నిర్వా సిత రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చె ల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు,భాధిత రై తులు సింగం వెంకటేశ్వర్లు,వాంకుడోత్ మోహన్, వాం కుడోత్ తేజ్యా, వి.శంకర్, జె.రాజు, బి.రాం ప్ర సాద్, జి.రమేష్ తదితరులు ఉన్నారు.