Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గత ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికు లకు బిల్లులు చెల్లించక పోవడంతో ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమ వారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 అక్టోబర్ నుండి 9, 10 తరగతులకు వంట బి ల్లులతో పాటు 1 నుండి 10 తరగతులకు వరకు కోడిగుడ్ల బిల్లులు చెల్లించకపోవడం వలన మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్య క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు తక్ష ణమే మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన 2 వేల రూపా యల వేతనాన్ని ప్రకటించిన నాటినుండి అమలు చేయాలని కోరారు. కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం లో మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వేముల రుజన్య, మండల అధ్యక్ష, కార్య దర్శులు రాణి, యాకమ్మ, రాధిక, సరిత, చంద్రకళ, సుభద్ర, జయమ్మ, అరుణ, ఉమారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.