Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనం తరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసి ల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది హమాలీ కార్మికు లు ఉన్నారని, వారి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిప డ్డారు. తెలంగాణ వస్తే కార్మికుల బతుకులు మారు తాయని, బాధలు తీరుతాయని హమాలీ కార్మికులు ఆశించారని తెలిపారు. ఏళ్ల తరబడి హమాలి కార్మి కులు ఎదురుచూస్తున్న వెల్ఫేర్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి హమాలీ కార్మికుల సమస్యల ను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. హమా లీ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించా లని కోరారు. 55 సంవత్సరాలు ఉన్న హమాలీ కా ర్మికులకు నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు అం బటి సోమయ్య, షేర్ సమ్మయ్య, తోట రాజు, గాదరి ఇస్తరి, తాంబరాజు కాసిం, ఒర్రె రాములు, గాదపాక కుమార్, తోట రాజు, కత్తుల అశోక్, ఆంజనేయులు, అనుముల రమేష్, పెండ్లి భాస్కర్, ఏ. రాజు, ఎండి మైబు, ఈరెంటి యాకన్న, చిక్కుడు పరమేష్, ఎండి గుంశ, పెద్దపురం, ఎండి ఫరీద్, పరశురాములు, వివి ధ గ్రామాల హమాలీ కార్మికులు పాల్గొన్నారు.