Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ప్రజల తమ సమస్యల పరిష్కారం కొరకు సమ ర్పించిన విజ్ఞప్తులను త్వరితగతిన పరిష్కరించే దిశగా నే మండల స్థాయిలో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయ డం జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సోమ వారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాల యంలో గ్రీవెన్స్‌డే పురస్కరించుకొని ప్రజావాణి కార్య క్రమాన్ని సంబంధిత అధికారులతో కలెక్టర్ నిర్వహిం చారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జడ్పి చైర్మన్ కుమారి అంగోత్ బిందు పాల్గొనగా 52 విజ్ఞప్తులను కలెక్టర్ స్వీకరించారు. మండల పిఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి దరఖాస్తును కలెక్టర్‌కు అంది స్తూ 2016-17నకు బయ్యారం నుండి ముత్యాల మ్మగూడెం వరకు 9కోట్లతో రహదారి నిర్మించడం జరుగుతున్నదని, ఉప్పలపాడు వద్ద స్థూపం రహదా రికి ఆటంకం కల్గిస్తున్నందున చర్యలు తీసుకోవాలని కోరారు.అదే మండలానికి చెందిన సుద్దపల్లి నారా యణ రావు దరఖాస్తు అందిస్తూ యాసంగి పంటకు తనతో పాటు మరికొంత మంది రైతులకు రైతు బం ధు అందలేదన్నారు. మండలంలోని రామచంద్రాపు రంకు చెందిన అడ్డ కేతమ్మ తాను గుడిసెలో వికలాం గుని కుమారునితో జీవిస్తున్నానని తనకు డబల్ బెడ్ రూమ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గంధంపల్లికి చెందిన రావూరి వేణుగోపాల్, సిహెచ్. పుల్లయ్య రైతులు దరఖాస్తు అందిస్తూ పంట పొలాల మధ్య ఇటుక బట్టీల వలన పంటలకు నష్టం వాటిల్లుతున్న దని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్రాం పురంకు చెందిన జగతండా నివాసి గుగులోత్ లక్ష్మ దరఖాస్తు అందిస్తూ తనకు ఫించన్ మంజూరు చే యాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధా నం ఇస్తామని ఖచ్చితమైన పరిష్కారానికే మండల స్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జవా బు దారితనం పెంచుతామని పారదర్శకతతో పను లు చేయిస్తామన్నారు.
ఈ గ్రీవెన్స్ డేలో ఆర్డిఓ కొమరయ్య, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, తాహసిల్దార్ రమే ష్, ఎంపీడీవో చలపతిరావు, ఇతర శాఖల అధికా రులు తదితరులు పాల్గొన్నారు.