Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
పెంచిన డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్బంగా డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ మాట్లా డారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గతంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు బ్యాక్లాగ్ సబ్జెక్టు ఉంటే వారు ఆయాసబ్జెక్టులు పరీక్షలు రాసుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కో ర్సులు, సెమిస్టర్ సిస్టం, ఇయర్ వైస్ స్కీమ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ తదితర ఏ పరీక్షలోనైనా బ్యాక్లాగ్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రక టన ఇవ్వడం జరిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో జరిగే ఆయా పరీక్షలకు అన్ని యూజీ, పిజి నాన్ ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులకు ఒక సెమిస్టర్‌కు 2వేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఒక పేపర్‌కు 3వేల రూపాయల చొప్పున పెంచడం, ఇయర్ వైస్ స్కీమ్ విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీ జు 3వేల రూపాయలు, ఒక పేపర్‌కు 4వేల రూపాయలు పెంచడం, మరోసారి పరీక్ష రాసుకుందాం అనుకుంటే నిరుపేద విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక, కాలేజీలకి వెళ్లలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చాలామంది నిరుపే ద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేకనే ఇన్ని రోజులు డిగ్రీ పరీక్షలకు దూరం ఉన్నారని అన్నారు. మరోసారి డిగ్రీ బ్యాక్ లాక్ ఫీజులను దారుణంగా పెంచడం సిగ్గుచేటు అన్నారు. ఒక్క పేపర్‌కే 3వేల రూపాయలు చెల్లిస్తే, పది సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్న వాళ్లు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే పెంచిన డిగ్రీ ఫీజుల ను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఖాళీ అయినందు వలన, నిరుపేద విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేద్దామని ఆలోచన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి విద్యార్థులు చెబుతారని అన్నారు. పెం చిన ఫీజులు తగ్గించని ఎడల రాష్ట్రంలో ఉన్న డిగ్రీ విద్యార్థులను సమీకరించి ఆం దోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ ఐ జిల్లా నాయకులు బానోతు సింహాద్రి, పట్టణ నాయకులు గుండ్ల రాకేష్, కడారి ప్రవీణ్, వినోద్ మమత, లావణ్య, ఇందు, విద్యార్థులు పాల్గొన్నారు.