Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వివిధ విజ్ఞప్తులను పరిష్కరించేందుకు ఆయా ధరఖా స్తులకు జిల్లా అధికారులు అధిక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆదేశించారు.గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం ఆయన కలెక్టరేట్లో నిర్వ హించిన ప్రజావాణిలో జిల్లా అధికారులతో కలిసి పా ల్గొని ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించారు. త న స్వంత భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించాలని జ నగామకు చెందిర కొణిదల చంద్రయ్య ధరఖాస్తు చే సుకున్నారు. కాలనీలో 50 ఫీట్ల రోడ్డు ఆక్రమణలకు గురవుతోందని, తగు చర్యలు తీసుకొని ఆక్రమాలను అరికట్టాలని జిల్లా కేంద్రంలోని సిఎంఆర్ కాలనీ వె ల్ఫేర్ సొసైటీ సభ్యులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొడకండ్ల మండలానికి చెందిన రా సాల వీరయ్య అనే దివ్యాంగుడు తనకు మోటార్ సైకి ల్ ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. గ్రా మానికి చెందిన సర్వే నంబరు 132లో కొంత మంది అక్రమంగా పట్టా చేసుకున్నారని, అట్టి పట్టాను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఎదునూరి కుమారస్వామితోపాటు మరో 9 మంది రైతులు ధర ఖాస్తు చేసుకున్నారు.జెసిఆర్ కాలువ నిర్మాణంలో తా ను కోల్పోయిన భూమికి సంబంధించిన నష్టపరిహా రం ఇప్పించాలని పాలకుర్తి మండలం శాతపురం గ్రా మానికి చెందిన పశలాది చంద్రశేఖర్ కలెక్టర్‌ను కోరా రు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బిసి వెల్ఫేర్ 1, వ్యవసాయం 1,ఉపాధి కల్పన 1,జిల్లా పం చాయతీ అధికారి 1. డిఆర్డీఒ 2, మున్సిపల్ 2, ఐసి డిఎస్ 2, పోలీస్ శాఖ 2, ఎస్సీ సంక్షేమం 6, రెవెన్యూ శాఖ 29, మొత్తం 47 ధరఖాస్తులు వచ్చినట్లు, వాటి ని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రాంరెడ్డి, జిల్లా పం చాయతీ అధికారి వసంత, జిల్లా సివిల్ సప్లై అధికారి రోజా రాణి, డిఎం.సంధ్యారాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఉద్యానవన శాఖ అధికారి లత, పరిశ్రమల శాఖ అధికారి రమేష్, పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ దామోదర్ రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఒ కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాల న అధికారి మన్సూరి, తహసీల్దార్ రవీందర్, ఇతర జి ల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.