Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశ ప్రధాని మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్నారని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయటానికి నిరసిస్తూ సోమ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్య క్షుడు అయితే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా స్వామ్య పరిరక్షణ దీక్ష ఏర్పాటు చేశారు. ఈ దీక్షను ఉద్దేశించి గండ్ర సత్యనారాయణ రావు మాట్లా డుతూ.. ప్రధాని మోదీ రాహుల్ గాంధీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే కుట్రపన్ని వేటు వేశారని విమర్శించారు. దేశ ప్రజల పక్షాన నిలబడి ప్రజా స్వామ్యాన్ని కాపాడిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటిది హడావుడిగా రాహుల్ గాంధీని అనర్హుడుగా ప్రకటించిందన్నారు. గత నెల 7న మోదీ సర్కార్ ను ప్రభుత్వాన్ని నిండు సభ లో ఆదానీ కుంభకోణంపై రాహుల్ ఘాటుగా ప్ర శ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరైన సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించిందని అన్నారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం, అదానీ - మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోం దన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ దీక్షలో భూపాలపల్లి జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష బాధ్యులు, వరంగల్ పార్లమెంటు కంటెస్టెడ్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ లతో పాటు, పలు మండలాల ప్రెసిడెంట్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పలు మండ లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, పలు గ్రామాల తాజా, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.