Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు సహాయ కులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (టీఎన్జీవో అనుబంధం) యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్. సరోజన కోరారు. ఇటీవల జిల్లా నూతన కమిటీ ఎన్ను కోగా డి డబ్ల్యూ శైలజను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి లో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని అన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులను కేటాయించి బదిలీలను అమలు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా బదిలీలు పదోన్నతుల వివరాలను తెలుపాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. టీచర్లకు పని భారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు చంద్రకళ, ఎం వసంత, కోమలాదేవి, రుద్రారపు ప్రియాంక, త్రివేణి, ఎస్.సుజాత, ఎస్ హిమబిందు, తిరుపతమ్మ, ఏం.విజయలక్ష్మి, నీలిమ, విజయ, సుమలత, రజిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.