Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
నేరాల నియంత్రణ కోసం అసాంఘిక శక్తులతో పాటు, పాత నేరస్తులపై దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా ఎస్సై, సీఐ,డీఎస్సీలు పని చేయాలన్నారు. ఇందుకోసం కోర్టు సంబంధిత అంశాల్లో సమర్ధవంతంగా పని చేసి, శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్100 కాల్స్‌కు వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహా యం అందజేయలాని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, బి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పీ కిషోర్ కుమార్, జిల్లాలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.