Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తరలివచ్చిన ప్రజలు
నవతెలంగాణ-జనగామ
బిజెపి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు జనం నీరాజనం పలికారు. ఈనెల 23వ తేదీన ఆదిలాబాద్ లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర సోమవారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య నాయకత్వంలో వస్తున్న యాత్ర బృందానికి జనగామ ప్రజలు బతుకమ్మ మంగళహారతులతో స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా క్రిస్టియన్ గ్రౌండ్లోకి ర్యాలీగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు కోలాటాలు, బతుకమ్మ ఆటలతో ఈ బృందం మహాసభ స్థలికి చేరుకుంది. ఈ మహాసభకు జిల్లా లోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాసభలో ప్రజలను ఉద్దేశించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య ఎండి అబ్బాస్ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు యాత్ర బృందం సభ్యులు స్కైలా బాబు, పి జయలక్ష్మి మాట్లా డుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోటీశ్వరులకు కొమ్ము కాస్తున్నదన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ సంపద ఆదాని అంబానీల ఖాతాలోకి తరలించబడుతుం దన్నారు. దేశంలో మతోన్మాద శక్తుల ఆటలు ఇక సాగవని ప్రజాస్వామ్యవాదులు తిరగబడతారని అన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఈ కుట్రలను ఎండగట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో రోజురోజుకు మహిళల పై అత్యాచా రాలు, దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. వీటన్నిం టిని ఎదుర్కొని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేం దుకు దేశ ప్రజలు సంఘటితమవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన చైతన్య యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని అన్నారు. మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ఎండగట్టడానికి, రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్న ఈ యాత్రకు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతివ్వాలని విజ్ఞప్తి చేశారు. 2023 మార్చి 29 హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, ఎం ఆడవయ్య, జగదీశ్, పార్టీ జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వేంకట్రాజం, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, గొల్లపల్లి బాపు రెడ్డి, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, బి.చందు నాయక్, పి. ఉపేందర్, బోడ నరేందర్, ఎ. కుమార్, సిఎచ్. సోమన్స, పార్టీ సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్, ఎండి. దస్తగిర్, మండల కార్యదర్శులు జి. మహేందర్, బి. కరుణాకర్, నాయకులు బిట్ల గణేష్, బి వెంకటమల్లయ్య, ధర్మబిక్షం, దడిగె సందీప్, డి. నాగరాజు, టి దేవదానం, .లింగం, లలిత, సిఎచ్ రజిత బాలు, బ్లెస్సింగ్టన్, బీరయ్య, మీట్యా నాయక్, ఎ. సురేష్, జి. గణేష్. కె. కళ్యాణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.