Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఏఐకే ఎస్ జిల్లా కోశాధికారి బొల్లం సాంబరాజు పిలుపుని చ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రై తు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘా లు, ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం మం డల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నా యకురాలు ఆరూరి భాగ్య ఆధ్వర్యంలో ఛలో ఢిల్లి గోడపత్రికను ఆవిష్క రిం చడం జరిగింది. ఈ కార్య క్రమానికి తెలంగా ణ రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా కో శాధికారి బొల్లం సాంబరా జు ముఖ్య అతి థిగా హాజ రై గోడప త్రికను ఆవిష్క రించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మి కులను దెబ్బతీసే విధానా లను అవలంబిస్తుందని వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని అన్నారు, మూడు నల్లచట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని కుబేరుల చేతిలో పెట్టిం దని విమర్శించారు.
ప్రభుత్వ సంస్థలైన సీసీఐ, కో-ఆపరేటివ్ వ్యవ స్థలను వారికి కట్టబెట్టేందుకు ఎదురు చూస్తుం దని మండిపడ్డారు. రైతులు, కార్మికులు వారి హక్కు లను కాపాడుకోవడానికి చలో ఢిల్లీ కి పిలుపునిచ్చా య న్నారు. కేంద్రప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరా లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్ విధానాన్ని ఆపాలన్నారు.ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో పంట నష్టపోయిన ప్రతిరైతుకు, కౌలు రైతులను ఎటువంటి నిబంధనలు లేకుండా ఆదుకోవాలని డి మాండ్ చేశారు.రైతులు పండించిన పంటలకు పెట్టు బడి పెట్టిన దానికంటే అదనంగా 50 శాతం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. వీటికి చట్టభద్రత కల్పించి,పేద మధ్యతరగతి రైతులను ఆదుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు.తెలంగాణలో రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడు తున్నాయని తెలిపారు.57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రికి పెన్షన్ చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ కార్మికులు కూలీలు వారి సమస్యలపై గల్లీ నుండి ఢిల్లీదాకా పోరాడి హక్కులను సాధించుకుం టామన్నారు.ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్య క్రమానికి రైతులు,కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరహరి,బిక్షపతి, అనిత, స్వరూప, కుమార్, గట్టయ్య, అరుణ, కోమల పాల్గొన్నారు.