Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై ఖండన
- దీక్షలో ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని..రాహుల్ గాంధీ ఎంపీ పదవిని రద్దుపర్చి అనర్హుడిగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ సెం టర్లో కాంగ్రేస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష నిర్వహించారు.ఈ సంద ర్భంగా దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రజా వ్యతిరేక, అవినీతి పాల నపై రాహుల్ గాంధీ దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారత దేశం వరకు 3, 600 కిలో మీటర్ల జోడోపాదయాత్ర చేపట్టారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగట్టడంలో రాహుల్ సఫలీకృతుడైయ్యారన్నారు. ఈ యా త్రకు ప్రజల్లో నుంచి వచ్చిన ఆధరాభిమానులను చూసి తట్టుకోలేక మోడీ దొడ్డిదా రిన కేసులు నమోదు చేయించి ఎంపీ సభ్యత్వం రద్దు చేశారన్నారు. ఇది ముమ్మా టికీ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాణ నిలిచి పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. దీనిని జీర్చుకోలేక ఈ అక్రమ పద్ధతిలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. అక్రమ కేసులను, ఎంపీ పదవీ రద్దుపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. మోడీ మరో శ్రీలంకను మరిపించేలా నియంతృత్వ పాలనను సాగిస్తున్నాడని దుయ్యపట్టారు.
వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోకపోతే దేశ వ్యాప్తంగా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, సొంతిరెడ్డి రంజిత్ రెడ్డి, నాయకులు తక్కెళ్లపెల్లి రవీందర్ రావు, వే ముల సాంబయ్య, ఒర్సు తిరుపతి, ఎర్రెల్లి బాబు, చిట్యాల తిరుపతి రెడ్డి, మహిళా కాంగ్రేస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, ఆడెపు రామా తదితర మండలాల నాయకులు పాల్గొన్నారు.