Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో భూమిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాపోరుయాత్ర కన్వీ నర్ తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ ప్రజా పోరి యాత్రలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని పనికర గ్రామంలో సిపిఐ మండల కన్వీనర్ కందిక చెన్నకేశవులు ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న దళితులను సందర్శించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివద్ధి సాధనకై తెలంగాణ విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ హామీ లు అమలుకై సిపిఐ ప్రజా పోరు యాత్ర బయ్యారంలో ఉక్కు పరిశ్రమలు స్థాపిం చాలని కాజీపేటలో రైల్వే పరిశ్రమను స్థాపించాలని ములుగులో గిరిజన విశ్వవి ద్యాలయానికి తగిన నిధులు కేటాయించాలని పోడు రైతులుకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు వేసుకొని నివసిస్తున్న పేదలకు పట్టాలి ఇవ్వా లని బొగ్గు గనులను ప్రైవేటు కరణ నిలిపివేయాలని, సింగరేణి ఆధ్వర్యంలో మై నింగ్ నిర్వహించాలని, హైదరాబాదు నుండి జనగామ వరకు ఇండిస్టియల్ కారి డారును ఏర్పాటు చేయాలని హనుమకొండలో ఏప్రిల్ 5న నిర్వహించే భారీ బహిరసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి, వరం గల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, మాజీ ఎమ్మెల్యే జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, భూపాలపల్లి కార్యదర్శి కొ రిమీ రాజకుమార్, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు, తదితరులు పాల్గొన్నారు.