Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో టీజివో అసోసియేషన్ సహకారంతో ఒ మేగా బన్ను హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేస ిన ఉచితక్యాన్సర్ వైద్య పరీక్షల శిబిరాన్ని హనుమ కొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావే శానికి టీజీవో అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జి ల్లా కో-ఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు అధ్యక్షత వహించగా, జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ కా న్సర్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండా లన్నారు. సాధారణంగా కాన్సర్వ్యాధిపై నిర్లక్ష్యం తగ దని వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలకు ఎక్కువ శాతం ప్రాముఖ్యత ఇవ్వరని ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధా రణ చేయగలిగితే చికిత్సతోవ్యాధి నయం చేసుకోగల మన్నారు. ముఖ్యంగా మహిళలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని క్యాన్సర్‌బారిన పడే ప్రమాదం నుండి బయటపడవచ్చని,ఉద్యోగం చేసే మహిళలు అటు ఇంటి పనులు ఇటు ఆఫీస్ పనులలో పడి తమ ఆరో గ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్త లు తీసుకోవాలని సూచిం చారు. ఈ శిబిరాన్ని నిర్వ హిస్తున్న ఒమేగా బన్ను హాస్పిటల్ వారిని ఇందు కు సహకరిస్తున్న టీజివో అసోసియేషన్ వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభి నందించారు. భవిష్యత్ లో టీజివోస్ ఐడిఓసి లో ని ఉద్యోగులందరికీ ఉపయోగపడే విధంగా ఇతర రకాల వైద్య సేవలను అందించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి మాట్లాడు తూ వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అలసత్వం తగదని పరీక్షల ద్వారా ప్రాథమికదశలో వ్యాధి నిర్ధారణ చేసు కోగలమన్నారు. అలక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమా దం వాటిల్లుతుందన్నారు. ఒమేగా బన్ను హాస్పిటల్ సహకారంతో ఉద్యోగులకు ఉచితంగా బ్రెస్ట్, సర్వై కల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒమేగా బన్ను హా స్పిటల్ అంకాలోజిస్ట్ డాక్టర్ శ్రీవల్లి క్యాన్సర్ వ్యాధిపై మాట్లాడుతూ క్యాన్సర్ అనేది 4 స్టేజీలు ఉంటాయి, మొదటి దశలో 100శాతం, రెండవ దశలో 90 శాతం, మూడవదశలో 70 శాతం నయం కావడానికి అవకాశం ఉంటుంది, కానీ నాలుగవ దశలో 50 శా తం మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సం దర్భాలలో కేవలం వ్యాధి తీవ్రస్థాయిదాల్చకుండా, పూర్తిగా తగ్గకుండా మందుల ద్వారా లేక రేడియేష న్ ద్వారా వైద్యం అందించవలసి ఉంటుంది. కావున మొదటి దశలో నిర్ధారించవలసిందిగా తెలిపారు. దాదాపు 10 ఏళ్లతర్వాత సర్వైకల్ క్యాన్సర్ తీవ్రస్థాయి దాలుస్తుంది ఈ పదేళ్లలో దానిని గుర్తుపట్టడానికి వీలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిర్ధారించ లే క ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ, ప్రతి 2 నుండి మూడేళ్లకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్‌కు నిర్ధారణ పరీక్షలు చేయిం చుకోవడం వల్ల క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించ డానికి అవకాశం ఉంటుందన్నారు.
కాన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించి తగు వై ద్య సలహాలను అందించారు. ఈ శిబిరం ఎంతో మందికి ఉపయోగపడే వి ధంగా తోడ్పడుతుందని అందరూ ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తులు పెద్దసం ఖ్యలో ఈ శిబిరానికి హాజ రుకావడం సంతోషకరమ ని ఈ శిబిరం నిర్వహించిన ఒమేగా బన్ను హాస్పిటల్ వారికి సహకరించిన జిల్లా కలెక్టర్,జగన్ మోహన్రా వుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఆకవరం శ్రీనివాస్ కుమార్, జిల్లావైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాం బశివరావు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, బన్నుఆరోగ్యదా సేవా సంస్థ డైరెక్టర్ ఈవి శ్రీనివాసరావు, టీజివో నాయకులు మురళీధర్ రెడ్డి, హరిప్రసాద్, మేనశ్రీను, ఐఅండ్పిఆర్ఏడి లక్ష్మ ణ్, భూపాల్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, సురేష్ కుమార్, నాగ నారాయణ, మాధవరెడ్డి, శేషు, రఘుపతి రెడ్డి, వెంక టేశ్వర్లు, ఆస్నాల శ్రీనివాస్, విజయనిర్మల, మహిళా అధికారులు నీరజ, వసంత లక్ష్మి, మాధవిలత, విజ యలక్ష్మి, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ మదన్మోహన్, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ అశోక్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.