Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వేసవిలో వేడి గాలులు, అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేప ట్టాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళ వారం ప్రధాన కార్యాలయంలో వేసవిలో వేడి గాలులు, అగ్ని ప్రమాదాలు జరగ కుండా చేపట్టాల్సిన ముందస్తుచర్యలపై నీటి సరఫరా, ఇంజనీరింగ్, డి ఆర్ ఎఫ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ అధికారులతో మేయర్ సమన్వయ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వేసవి కాలంలో 11 రకాల రెడ్ కేటగిరీ మెటీరియలైన స్క్రాప్ గోడౌన్స్, పయింట్స్ వార్నిష్ గోడౌన్స్, ఆయిల్ స్టోరేజెస్, ఫైర్ క్రాకర్స్, టీంబర్డిపో, వేర్ హౌస్ గోడౌన్స్, గన్నీ బాగ్స్, రసా యనాల ఇండిస్టీలు, తదితర హానీ కలిగించేవి నివాస ప్రాంతాల్లో నిల్వ ఉండ కుండా చూడాలన్నారు. ఆయా వాణిజ్య సంస్థలు ప్రాథమిక కనీస అగ్నిమాపక భ ద్రతాచర్యలు, పోర్టబుల్ ఫైర్-ఎక్స్టింగ్విషర్స్, ఇసుకతో బకెట్లు, నీటి నిల్వ సౌకర్యా లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాపార, వాణిజ్య ప్రదేశాల్లో, పత్తి పరిశ్రమల్లో, గోదాముల్లో, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు దరిచేరవని, దీనిపై నగర ప్రజలను చైతన్య పరచాలని అన్నారు.వేసవిలో తీవ్ర వేడి గాలులు వీచి అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై సర్వే నిర్వహించి, ప్లాస్టిక్, రసాయనాలు మొదలైన మండే వస్తువులు నిల్వ ఉండకుండా అగ్ని భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో బల్దియా అదనపు కమిషనర్ రవీందర్, ఎస్ ఈ లు కష్ణ రావు, ప్రవీణ్ చంద్ర , ఉప కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, సి హెచ్ ఓ శ్రీనివాస్ రావు, డిఎఫ్ ఓ శంకర్ లింగం, ఎంహెచ్ ఓ జ్ఞానేశ్వర్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, పారిశుధ్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.