Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు అధ్యక్షతన జరి పిన బీఆర్ఎస్ 12 గ్రామా ల మొదటిదశ ఆత్మీయ స మ్మేళనంలో ముఖ్య అతిథి గా పాల్గొని ఆయన మాట్లా డారు. శాసనసభ్యుడిగా గె లుపొందడంలో దుగ్గొండి ప్రజలు ఇచ్చిన ఆశీర్వా దం మర్చిపోలేనిదన్నారు. మం డల అభివృద్ధిలో గతంలో ఏనాయకుడు చేయనివి ధంగా అత్యధిక నిధులు ఇ చ్చి అభివృద్ధి చేశానన్నారు. దుగ్గొండి మండల ప్రజ లు వడగండ్ల వర్షాలతో పంటలు కోల్పోయి దుఃఖం లో ఉన్నారని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి స్పందిం చి, రైతులను ఓదార్చి, పంటనష్టాన్ని ఎకరాకు రూ. 10 వేలు ప్రకటించి, ఆదుకున్నందుకు వారికి జీవి తాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజా ప్రతిని ధులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లేకపోతే, కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. గతానికి, ప్రస్తుతా నికి అభివృద్ధిలో తేడా ఉందని, అభివృద్ధి మన లక్ష్యం అని అన్నారు. రెండు పంటలకు సరిపడా సాగునీ టిని అందించి, రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపామన్నా రు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిం చే ప్రతిపక్షాలకు కాలం చెల్లిందని విమర్శించారు. మనందరి సమిష్టి కృషితోనే ప్రగతి సాధ్యమైందని, మరోసారి కేసీఆర్‌ని నిండు మనసుతో దీవించి, గు లాబీ జెండాను ఎగరవేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ప ీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.