Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేసినా..ఆయకట్టుకు అందని సాగు నీరు..
- జోరుగా నిర్మాణాలు..చోద్యంచూస్తున్న ఇంజనీరింగ్ అధికారులు
నవతెలంగాణ-నర్సంపేట
ఎస్సారెస్పీకాల్వలు ఎక్కడిక్కడా ఆక్రమణలకు గు రవుతున్నాయి. పలుచోట్ల కాల్వల స్థలాలను కబ్జా చే స్తూ అక్రమనిర్మాణాలు చేసి సొంతానికి ఉపయోగిం చుకుంటున్నారు. కాల్వలను పరిరక్షించాల్సిన సాగు నీటి పారుదలశాఖ ఇంజనీర్లు చోధ్యం ప్రదర్శిస్తు న్నా రని విమర్శలు వెలువడుతున్నాయి. వెరసి రెండు నె లలుగా విడుదల చేసిన సాగునీరు ఆయకట్టుకు అం దని పరిస్థితి దాపురించింది. మచ్చుకు నర్సంపేట మండలం లక్నెపెల్లి గ్రామశివారులో డీబీఎం 40/1 ఎల్ ఉపకాల్వపై అక్రమ కట్టడాల వల్ల చుక్కనీరు అందిన పాపానపోలేదు. నర్సంపేట-వరంగల్ రోడ్డు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ పిల్ల కాల్వపై బిట్స్ విద్యా సం స్థలు అక్రమ నిర్మాణాలు చేయగా 2017లో ఇంజ నీరింగ్అధికారులు కొంత మేరకు కూల్చేశారు. ఇది లా ఉంటే ఇటివల ఇదే కాల్వను కబ్జా చేసి పూడ్చి ఓ ప్రముఖ వైద్యుడు అక్రమ నిర్మాణాలు చేశాడు. పక్క నే తన స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తూ కాల్వ ఆయకట్టు రోడ్డుపై సీసీ నిర్మాణాలు చేపట్టాడు. చు ట్టూరా గ్రీల్స్ఏర్పాటు చేసి రిస్సార్ట్ను మరిపించేలా నిర్మాణం చేసి కాల్వస్వరూపమే లేకుండా చేశారు. దీ నికి తోడూమరొకరు ఆ పక్కనే డాబా హౌటల్ (బెల్ట్ షాపు)ఏర్పాటు చేశారు. మద్యం ప్రియులకు ఆహ్లాదం పంచేలా కల్వ కట్టపై అక్రమ నిర్మాణం చేపట్టాడు. 47అడుగుల వెడల్పు ఉం డాల్సిన ఈ కాల్వపై ఈ అ క్రమ కట్టడాలు చేస్తున్నా ఎస్సారెస్పీ ఇంజనీరు అధి కారులు పట్టించుకోకపోవ డంపై చోద్యంగా మారిం ది. ఈ అక్రమకట్టడాల వ ల్ల యాసంగి పంటకు రెం డు నెలలుగా విడుదల చే సిన నీరు డీబీఎం40 ప్రధాన కాల్వలకే పరిమిత మైంది. లక్నెపెల్లి, మహే శ్వరం,రామవరం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ఈ కాల్వకింద 2,361 ఎకరాల ఆయకట్టును నిర్ధేశించా రు. అక్రమకట్టడాల వల్ల ఉపకాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరందకుండా పోయింద ని రైతులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల భా రీనీటి ప్రాజెక్టులను, పాకాల, మాధన్నపేట, రంగయ చెరువు తదితర చెరువుల నిర్వహణకై ఇంజనీరు శాఖ లను ఒకే గొడుకు కింద తీసుకొచ్చారు. నర్సంపేటలో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయినా కాల్వల పై అక్రమ కట్టడాలను నియంత్రించడంలో దృష్టి సా రించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఈ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ అనుమ తులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా ఎస్సారెస్పీ ఉన్నత ఇంజనీరు అధికారులు స్పందించి కాల్వలపై అక్రమ నిర్మాణాలను తొలగించి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కాల్వపై అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలు చేపడుతాం: కిరణ్మయి, ఏఈ ఎస్సారెస్పీ డీబీఎం 40
డీబీఎం 40 కాల్వపై అక్రమ నిర్మాణాలపై తన దృష్టికి రాలేదు, ఆయకట్టు కాల్వను అక్రమించడం చ ట్టరీత్యా నేరం. ఇప్పటి వరకు 50 రోజులకు పైగా కా ల్వకు నీటి విడుదల చేశాం.పలు చోట్ల కాల్వలో మో టర్లు ఏర్పాటుచేసి నీటిని మళ్లించడం ద్వారా చివరి ఆయకట్టు వరకు అందడంలేదు. నియంత్రణ చర్యలుచేపట్టాం.తక్షణమేసందర్శించిచర్యలు చేపడుతాం.