Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనుల పై జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సంబంధిత పనుల పురోగతి పై ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధించిన ఇంజినీరింగ్ ఏజెన్సీలో ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో టిఎస్‌ఎంఐడిసి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత సంవత్సరం ఒకే సమయంలో రికార్డు స్థాయిలో 8 నూతన వైద్య కళాశాలలో రాష్ట్రంలో ప్రారంభించుకున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరం 9 వైద్య కళాశాల ప్రారంభించే లక్ష్యంతో వేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో ప్రారంభించే 9 నూతన వైద్య కళాశాల సీట్లు కలిపితే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3600 చేరుకుంటుం దని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం కరీంనగర్, కామారెడ్డి, జనగామ, వికారాబాద్ ,ఖమ్మం ,జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో నూతన వైద్య కళాశాల పనుల జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 6 వైద్య కళాశాల పనులను క్షేత్రస్థా యిలో ఎన్ఎంసి పరిశీలించిందని అన్నారు. పెండింగ్ ఉన్న చోట ఎన్ఎంసి తనిఖీలకు సిద్ధంగా ఉండాలన్నారు. వైద్య కళాశాలలో అవసరమైన సామాగ్రి , టీచింగ్ స్టాఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ల , మిగిలిన స్టాఫ్ నియామక ప్రక్రియ నెలన్నరలో పూర్తి చేస్తామన్నారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్స్ ప్రారం భం అయ్యే నేపథ్యంలో, వైద్య కళాశాలలను సన్నద్ధం చేసి ఎన్ఎంసి నుంచి అనుమతి సాధించాలని పేర్కొన్నారు. వైద్య కళాశాలలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని, జిల్లాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అక్కడ అవస రమైన మరమ్మత్తులు చేయాలన్నారు. హహిళల కోసం ప్రారంభించిన ఆరోగ్య మహిళా కేంద్రాలను మరింత విస్తతంగా వినియోగించాలని అన్నారు. ఆకస్మిక గుండె పోటు నివారణకు చేపట్టిన సిపిఆర్ శిక్షణ వివిద వర్గాల ప్రజలకు పకడ్బందీగా అందించాలని అన్నారు. దేశంలోనే అవయవ దానంలో తెలంగాణ ప్రధమంగా నిలిచిందని, అవయవదానం పట్ల ప్రజలలో అవగాహన కార్యక్రమా లు కొనసాగించాలన్నారు. జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం 180 పడకలు అందుబాటులో ఉన్నాయని, 150 అదనపు పడకల ఏర్పాటు కోసం 13 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టి 60శాతం పూర్తి చేశామన్నారు. మే నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జిల్లా ఆసుపత్రికి సమీపంలో సింగరేణి ఆసుపత్రిలో 150 పడకలు ఉన్నాయని, ఆ సదుపాయాలను సైతం వినియో గించు కుంటామని, 60మంది మహిళలకు, 40 మంది పురు షుల కోసం వేర్వేరుగా ప్రభుత్వ భవనాలు అందు బాటు లో ఉన్నాయన్నారు. వాటిని హాస్టల్‌గా వినియో గించు కుంటామని తెలిపారు. వైద్య కళాశాలలో ల్యాబ్ లు, తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భూపాల్‌పల్లిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. డీఎంహెచ్ఓ శ్రీరామ్, డీఈ, టీఎస్ఎంఐడీసీ నాగిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.