Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు
నవతెలంగాణ-భూపాలపల్లి
మున్సిపల్ కార్మికుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు అన్నారు. భూపా లపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత నగర పంచాయతీ ఆవరణంలో భూపాలపల్లి ము న్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నిత్యవసర సరుకులు ఆఫ్రాన్స్ యూనిఫాం, కొబ్బరి నూనె, సబ్బులు, బెల్లం, టవాళ్లు, చీరలు చేతి గ్లౌజులు, చెప్పులు పంపిణీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆయా కాలనీలను నిత్యం శుభ్రపరుస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేందుకు పాటుపడుతున్న కార్మికుల సేవలు అభినందనీ యమని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కార్మికుల సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి అవినాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు పిల్లల మర్రి శారద నారాయణ, ముంజాల రవీందర్‌గౌడ్, జక్కం రవికుమార్, నూనె రాజు, ముంజంపల్లి మురళీధర్, మేకల రజిత మల్లేష్, చల్లా రేణుక, వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రశాంతి కుమారి, నవీన్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.