Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని పెద్ద తండా (కె) నిర్మిస్తున్న దేవాల్లాల్ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆర్థిక సహాయాన్ని అందజేశారని కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లావుడియా దేవా నాయక్, బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి లావుడియా మల్లు నాయక్ తెలిపారు. మంగళవారం కొండా పురం ఎంపీటీసీ లావుడియా లలిత దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులతోపాటు తండావాసులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపురం పెద్దతండ కే లో నిర్మి స్తున్న సేవాలాల్ ఆలయ నిర్మాణ కమిటీకి మంత్రి ఎర్రబెల్లి రూ.10 లక్షలు సహాయాన్ని అందజేస్తు న్నారని తెలిపారు. మంత్రి అందించే ఆర్థిక సహాయం రెండు విడుతలుగా అందజేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్టీ సెల్ విభాగం మండల అధ్యక్షుడు ధారావత్ యాకూబ్ నాయక్, గ్రామ అధ్యక్షుడు రమేష్ నాయక్, వార్డు సభ్యులు శ్రీను నాయక్, తండ పెద్దలుగుగులోతు లచ్చిరాం నాయక్, వల్మియా, బాలు, బిచ్చ తదితరులు పాల్గొన్నారు.