Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స
నవతెలంగాణ-వరంగల్
రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రభుత్వప రంగా చేపట్టవలసిన కార్యక్ర మాలపై, గిఫ్ట్ప్యాకెట్స్ పంపిణీ పై ప్రణాళిక బద్ధంగా పగడ్బందీగా ఏర్పాట్లు చ ేయాలని అధికారులను అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదరుల కు బట్టల పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయు ప్రదేశాలలో ప్రభుత్వ పరంగా వసతులు కల్పన సంబంధిత విషయాలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ముస్లిం మత పెద్దలు జీ డబ్ల్యు ఎం సీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పంచాయతీ రాజ్, విద్యుత్, పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశన్ని అదన పు కలెక్టర్ శ్రీవత్స కోట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ జరుపుకోవ డానికి ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 18004251980 కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జీ డబ్ల్యుఎంసీ పరిధిలో ఈ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. ముస్లిం సోదరులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ ట్టలు పంపిణీ, ప్రభుత్వపరం గా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన మేరకు ప్రభు త్వ ఆదేశానికి అనుగుణంగా ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పా రు. వరంగల్ జిల్లాకు ఇఫ్తార్ విందుకు రూ.12 లక్షల కేటాయించగా అలాగే 6 వేలగిఫ్ట్ ప్యాకెట్స్ మూడు నియోజకవర్గాల పరిధిలో 12 మసీదుల ను గుర్తించడం జరిగిందని వరంగల్ (6), నర్సంపేట (3), వర్ధన్నపేట (3)ఎంపిక చేసుకుని ఒక్కో మండలంలో 500 మంది ముస్లిం సోదరుల కు స్థానికశాసనసభ్యులు ప్రజా ప్రతి నిధుల సమక్షంలో బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇఫ్తార్ విందు జరుగు ప్రదేశాలలో ప్రభుత్వ పరంగా శానిటేషన్,వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ క్యాంప్ ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు నిర్వహణ, తాగునీరు వసతి, జీడబ్ల్యుఎంసీ ద్వారా లైటింగ్ ఏర్పాటు అన్ని సౌకర్యాలు పగడ్బందీగా చేపట్టాలని అధికారులకు పలు సూచనలు సలహాలు అం దించారు.ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్, జీ డబ్ల్యు ఎం సీ అడిషనల్ కమిషనర్ రషీద్, నర్సంపేట ఏసిపి ఏ. సంపత్ రావు, వర్ధన్నపేట ఏసిపి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.