Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రూప్-1 పేపర్ లీక్
- పేపర్ లీక్‌లో దోషులను కఠినంగా శిక్షించాలి
- కాంగ్రెస్ హయాంలోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు
- కాంగ్రెస్ హాత్ సే హాత్ జూడో యాత్రలో దొంతి
నవతెలంగాణ-నెక్కొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుం దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని సూరిపల్లి చిన్నకొర్పొల్ గ్రామల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో హాత్ సే హాత్ భారత్ జోడో యాత్ర కార్యక్రమన్నీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పాలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధ వరెడ్డి గ్రామాల్లో పలు కాలనీలను పర్యటించి ప్రజ సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రా ష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం జరిగిందన్నారు. నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం దీనికి కా రణమైన వ్యక్తులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసమస్యలను పట్టించుకోవడంలో విఫలం చెందారని ప్రజలకు ఇచ్చి న ఏఒక్క హామీ కూడా నెరవేర్చాలేదన్నారు. కేసీఆర్ కేవలం తన వ్యక్తిగత ఆస్తులు సంపాదించడం కోసమే పరితపిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చే యడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి అక్రమాలపై నిరంతరం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం నీ చమైన చర్యఅన్నారు. ప్రజలందరూ దీనిని వ్యతిరేకించి రాహుల్ గాంధీకి అండగా నిలువలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇందిరమ్మ భరోసా పేరుతో ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడంతో పాటు భూమిలేని ఉపాధి హా మీ కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన మొదటి ఆరునెలల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యో గాలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుందని నిరుద్యోగు లకు హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్యాస్, సిలిండర్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా విపరీతంగా ధరలు పెంచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థ లను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమ ర్శలు చేశారు. నర్సంపేట అభివద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవు తుందని కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివద్ధి పనులను ప్రజలకు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని ప్ర జలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి స భ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరి ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దునూరి సాయికృష్ణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల మైపాల్ రెడ్డి, నెక్కొండ పట్టణ యూత్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, సూరిపల్లి ఎంపీటీసీ మాదా టి శారద శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుల కవిరాజు, మాజీ ఎంపిటిసి గంట దయాకర్‌రెడ్డి, చిన్నకొర్పోల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు పెళ్లి యాకయ్య, చెరువు ముందు తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కున్సోత్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ బానోత్ హరిలాల్, పులి శ్రీనివాస్, బొడ్డుపల్లిచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.