Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
అభివద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జె డ్పీటీసీ చాడ సరిత అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలో మండల పా ర్టీ అధ్యక్షుడు మరిజె నర్సింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో వేలేరు మండలం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతుందని అన్నారు. మండలం లోని వే ములపల్లి నుండి కన్నారం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4.26 కోట్లు, బండతండా (మాటుతండా) నుండి ఎర్రబెల్లి వరకు రూ.1.10 కోట్లు మంజూ రైనట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ. 5.36 కోట్లు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ సంపత్, కో ఆష్షన్ సభ్యులు జానీ, సర్పంచ్ లు మ్యాక రవీందర్, రాంచందర్, మండల సమన్వయకర్త రాజేశ్వర్ రెడ్డి, వివిద గ్రామాల సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.