Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్
నవతెలంగాణ-ఎల్కతుర్తి
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పాత్రికేయు ల పాత్ర మరువలేని దని, హు స్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. బుధ వారం మండల కేంద్రంలో, నూతనంగా ప్రెస్‌క్లబ్ ప్రారంభో త్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, పాత్రికేయులు ఎలాం టి లాభాపేక్ష లేకుండా, వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించార ని గుర్తు చేశారు. పాత్రికేయ వత్తిలో ఉంటూ ఇప్పటివరకు వారు సంపాదించుకున్నది ఏమీ లేదని, ఉదయం 6 గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకు శ్రమించి, వార్తలను సేకరించి పత్రికలకు పంపిస్తారని కొనియాడారు ,ఏదేమైనా ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే పత్రికారంగం నిజాయితీతో నిబద్ధత తో పనిచేయాలని సూచించారు. పాత్రికేయ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకువెళ్లి తొందరలోనే వారి సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన బాణాల దన్ రెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమంలో హను మకొండ జిల్లా జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ ,సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ పోరెడ్డి రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, తాసిల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎలుకతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై జక్కుల పరమేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుఖిన సంతాజి, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కుడితాడి చిరంజీవి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ఎండి నసూర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్లే మహేందర్, ఎల్తూరి స్వామి, తంగడ మహేందర్, అన్ని గ్రామాల సర్పం చులు ,ఎంపీటీసీలు ,పాత్రికేయులు పాల్గొన్నారు.