Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వరంగల్ / సుబేదారి
జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బం దీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వి ద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధి కారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడి యట్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇం టర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వ హించి నందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లనుఆదేశించారు. రాష్ట్ర వ్యా ప్తంగా 4.90 లక్షల మంది విద్యార్థులు 10వ తరగ తి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2.600 వేల కు పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించా మని, దీనిపై ఎక్కువ ప్రచారం కల్పించాలని తెలి పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కో సం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్ర ద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవి కాలం లోపరీక్షలు నిర్వహిస్తున్నందునఅప్రమత్తంగా ఉండా లని మంత్రి సూచించారు. విద్యా ర్థులకు హాల్ టికె ట్లను వెబ్సైట్ ఉం చామని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉం డేవిధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్షహాల్లో తాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నా రు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకునివెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసి క ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్నిఏర్పాట్లు చే యాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న లివిద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహ ణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చే సుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని కలెక్టర్ లకు సూచించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్స కోట మాట్లా డుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అందరి అధికారులు సమ న్వయంతో నిర్వహించడానికిచర్యలు చేపట్టామని అ న్నారు. జిల్లాలో 56 సెంటర్స్ఉన్నాయని 9,728 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరవు తు న్నారని ఈ సెంటర్స్ లో అన్ని వసతులు ఏర్పాటు చే స్తున్నామని హెల్త్ ఆర్టీసీ పోస్టల్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమావేశాలు నిర్వహిం చుకొని ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ నిర్వహిస్తు న్నట్లు చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సిక్తా పట్నా యక్, జిల్లా విద్యాశాఖ అధికారులు వాసంతి. అబ్దుల్ హై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంక టరమణ, డీహెచ్ఎంవో సాంబశివరావు, డిపివో జగ దీశ్వర్, కలెక్టరేట్ ఏవో కిరణ్ ప్రకాష్, ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమకొండ ఆర్. బాబు నాయక్, తదిత ర పోలీసు, మునిసిపల్, వైద్య, రెవెన్యూ శాఖల అధి కారులు పాల్గొన్నారు.