Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
నవతెలంగాణ-శాయంపేట
దళిత కుటుంబాలు కడుదయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండడంతో గుర్తించిన సీఎం కేసీఆర్ దళితులకు గౌరవప్రదమైన జీవనం అందించడానికి దళి తబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీని వాస్ అన్నారు. మండలంలోని మైలారంలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్ పథకా లపై అవగాహన సదస్సు సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా, ము ఖ్యఅతిథిగా వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఆయన పాల్గొని మా ట్లాడారు. కరోనా సమయంలో కూడా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షే మ పథకాలు అందజేశారని తెలిపారు. గతంలో దళితులు సమాజంలో గౌరవం గా బతికే పరిస్థితి లేదని, దానిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా రుణాలు అందిస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చాక 300 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతో పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. దళితులు కూడా వత్తిలో ప్రాధాన్యత ఉన్న వాటిని ఎంచుకొని జీవనోపాధి పొందాలని సూచించారు. దళితులకు మూ డెకరాల భూ పంపిణీలో భాగంగా రూ.736 కోట్లతో 600 మందికి భూములు పంచారని తెలిపారు. 40 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మందికి దళిత బంధు పథకం లబ్ధి చేకూరిందన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ దళితులఅభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, నూతన సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేశారని తెలిపారు. కార్పొరేషన్ జనరల్మేనేజర్ ఆనంద్ కుమార్ ఎస్సీ కార్పొరే షన్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈడి మాధవి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బీరెల్లి రజిని, మంతిని ఎస్సీ సెల్ అధ్యక్షులు సడలవి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పార్టీ మం డల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపిటిసి గడిపే విజయ విజరు కుమా ర్, ఉప సర్పంచ్ సునీత సాంబరెడ్డి, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, నాయకులు మసికే కళ్యాణ్ పాల్గొన్నారు.