Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
పార్లమెంట్, అసెంబ్లీలో రైతుల తరపున వారి సమస్యలను ప్రస్తావించే ప్రతినిధులు కరువ య్యా రని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి వెంకట నారా యణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సం ఘం వరంగల్ ఉమ్మడి జిల్లాసదస్సు బుధవారం జి ల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన గీసు గొండ మండలం కొనయ మాకులలోని ఓంకార్ గార్డె న్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షోభం లో భారత వ్యవసాయ రంగం -పరిష్కార మార్గాలు, ప్ర భుత్వాల బాధ్యత, మన కర్త వ్యం అనే అంశంపై రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నారాయణ, ఏఐకేఎఫ్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దా రపు రమేష్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రాచర్ల బాలరాజులు మాట్లాడుతూ గతంలోచరణ్సింగ్ లాంటి అనేక మంది జాతీయ పార్టీల నాయకులు రై తు సమస్యలపై పార్లమెంటులో చర్చించేవారని కానీ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానా లను అవలంబిస్తుంటే రైతుల పక్షాన నిలబడే పరిస్థి తి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నే డు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతులు అడుగడు గున దోపిడీకి గురవుతున్నారన్నారు. ప్రకతి వైపరీత్యా ల వల్ల జరిగిన పంట నష్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లే బాధ్యత వహించాలన్నారు. వర్షాల వల్ల వంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు కాకుండా రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుకు పంటనష్టం జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒ కరిపై ఒకరునిందలు వేసుకోకుండా పంటల బీమా పథకంపై దష్టి సాధించాలని కోరారు. ఈ సదస్సులో ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరగోని శంకరయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదె ల రాజయ్య ఉపాధ్యక్షులు హంసల్ రెడ్డి, లాడే మోహ న్‌రావు, పీరయ్య, జనార్దన్‌రెడ్డి, రాజిరెడ్డి, రాజు, ఎల్ల య్య, రవీందర్, అంబయ్య, సాంబయ్య పాల్గొన్నారు.