Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు
- ఇస్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న ఇసుక దందా మాఫియా
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం, రోల్లకల్లు, చెరువు ముందు తండా ఇసుక దందా మాఫియా దారులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఆకేరు వాగు శివారులో అసైన్డ్ భూములు, పట్టా భూములు వది లిపెట్టకుండా నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటు న్నారు. కళ్ళేదుటే ఇసుక దందా జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపెద్ద హిటాచీలు, పుక్లిన్ మిషిన్లతో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూముల్లో పెద్ద పెద్ద గుంతలు ఏ ర్పడి ప్రమాదకరంగా మారడంతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టా భూముల్లో తవ్వకాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల పర్మిషన్తో చేప ట్టాలని నిబంధన ఉంది. స్థానిక అధికార పార్టీ లీడర్లు ఇసుక అక్రమ తవ్వకాల దందాను ప్రోత్సహిస్తూ అంతా మేమే చూసుకుంటామని దళారీవ్యవస్థ చేపడుతూ అడ్డుఅదుపు లేకుండా రెచ్చి పోతున్నా రు. అసైన్డ్ భూముల్లో సైతం ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు మామూ ళ్ల మత్తులో పట్టించుకోవడంలేదని స్థా నికులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాది కారులు ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్న మాఫియాను అరికట్టాలని ప్రజలు రైతులు కోరుతున్నారు.