Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ముత్తిరెడ్డి'కి ముప్పు... రంగంలోకి 'పోచంపల్లి'
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్లో కొత్త సమీకర ణలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న బీఆర్ఎస్ కీలక నేత ఈ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా, ఆ వ్యాఖ్యలను ఎవరూ నమ్మడం లేదు. పార్టీలో ఆశావాదులు ఎవరి ప్రయ త్నాల్లో వాళ్లున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ జనగా మ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో చాప కింద నీరులా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వున్న వ్యతిరేకతను దృష్టిలో వుంచుకొని తనకు లైన్ క్లియర్ చేయించుకోవడానికి సదరు ఎమ్మెల్సీ పక్కా స్కెచ్‌తో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్ప టికే నియోజకవర్గంలోని బీఆర్ఎస్లోని పలువురు కీలక నేతలు సదరు ఎమ్మెల్సీ టచ్‌లో వున్నట్లు తెలుస్తుంది. నియో జకవర్గంలోని శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
జనగామ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశావహులు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే మళ్లీ పార్టీ టికెట్లు ఇస్తామని ప్రకటించినా, ఆశావహులు, రాష్ట్ర నాయకత్వానికి అత్యంత విధేయులుగా వున్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వుందన్న కార ణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఈ దిశగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పరకాల నియోజకవర్గంలోని వరికోల్ గ్రామానికి చెందిన నేత. కాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగు తుంది. కొంతకాలంగా 'పోచంపల్లి' నియోజకవర్గంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధిష్టానాన్ని నిలదీసినా, బుజ్జగించి పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో మండలస్థాయి నేతలతో ఎమ్మెల్సీ సత్సంబంధాలు నెలకొల్పుతూ నెట్‌వర్క్‌ను విస్తరిస్తు న్నారు. దీంతో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో 'సిట్టింగ్'కు స్థాన చలనం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.