Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి/ములుగు
జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళి కాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్ట ర్లు, జిల్లా ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవం తంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లు కు దించామని, దీని పై విస్తత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏ ఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొ న్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు రవాణా కో సం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని ఆదే శించారు. వేసవిలో పరీక్షల నిర్వహిస్తున్నందున అప్ర మత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్ లను ఆన్లైన్ bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ. ఱఅలో ఉంచామని, డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులు ఉచితంగా బస్సు లో ప్రయాణం చేయొచ్చని తెలిపారు. పరీక్ష హాల్స్ లో తాగు నీటితోపాటు అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పించాలని అన్నారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వ హణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని అన్నా రు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లా డుతూ భూపాలపల్లి జిల్లాలో 3651 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పోలిస్ స్టేషన్ కు 8 కిలో మీటర్ల కంటే దూరంలో ఉన్న 3 పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాల తరలింపు కోసం 2 రూట్లను గుర్తించామని తెలిపారు. 20 చీఫ్ సూపరింటెండెంట్, 2 ఫ్లైయింగ్ స్క్వాడ్, 200మంది ఇన్విజిలేటర్స్‌ను నియమించా మని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఆర్డిఓ. శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రామ్‌కుమార్, డీఎంహెచ్ఓ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా జిల్లా కలెక్టరేట్లోని వీడియో సమావేశం హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వైవి గణేష్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. జిల్లాలో 115 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 21 పరీక్షా కేంద్రాలలో 21 చీఫ్ సూపర్డెంట్లు 22 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారని,3170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. మూడు సి సెంటర్లు ఉన్నాయని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు 31వ తేదీలోగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అన్ని వసతులు కల్పిస్తామని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సరిపడా ఫర్నిచర్ ముందే ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు చల్లటి మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు , ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూ డదన్నారు. పరీక్షా కేంద్రాలలో పారిశుద్య చర్యలను చేపట్టాలని, నీటి పారుదల శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నా పత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు పోలీసు శాఖ నిర్వహించాలని తెలిపారు. పరీక్ష అనంతరం పరీక్షా పత్రాల తరలింపు ప్రక్రియను పోస్టల్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షలు ప్రారంభమై ముగిసేంత వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వైర్లెస్ సెట్ తో ఒక అధికారి ఎళ్లవేళలా అందుబాటులో వుండాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 2 రూట్లలో ప్రశ్నా పత్రాల పంపిణీ, జవాబు పత్రాలు భద్రపరచు సమయంలో రెవిన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. వైద్య అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్స్, హెల్త్ కిట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు సకాలంలో హజరయ్యేం దుకు ముందస్తు కార్యాచరణతో రూట్ మ్యాపుల ఏర్పాటు ద్వారా సిద్దంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇతర అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఈఓ పానిని, ఆడిషనల్ ఎస్పీ ఏఆర్ సదానందం, కె అశోక్(పోస్టల్ డిపార్ట్మెంట్), డీఈ(విద్యుత్‌శాఖ) నాగేశ్వర రావు, ఆర్టీసి డిపార్ట్మెంట్ జ్యోష్ణ, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీపీఆర్ఓ రఫీక్, ఏసిజిఈ జయదేవ పాల్గొన్నారు.