Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేనీ సాంబశివరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు కావస్తున్న పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల ఊసే ఎత్తడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనీ సాంబశివరావు అన్నారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరుయాత్ర భూపాలపల్లికి చేరుకుంది. ములుగు నుండి గణపురం, గాంధీనగర్ క్రాస్, చెల్పూర్, మంజూరు నగర్ ఫైవ్ ఇంక్లైన్ మీదుగా జయశంకర్, అంబేద్కర్ సెంటర్ల మీదుగా గణేష్ సెంటర్ నుండి హనుమాన్ టెంపుల్ నుండి 200 మంది పాదయాత్ర బందంతో ఈ యాత్ర అంబేద్కర్ సెంటర్కు చేరుకుంది. అనంతరం భూపాలపల్లి పట్టణం లోని అంబేద్కర్ సెంటర్లఓ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్తో కలిసి సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. దేశంలో ఆదాని అంబానీ బడా కార్పోరేట్ కంపెనీలకు మోడీ అమ్ముడుపోయాడని మండిపడ్డారు. బయ్యారం ఒక్క ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, హైదరాబాద్ కారిడార్ అనేక అనేక విభజన హామీలు నెరవేర్చడంలో కుట్రలు చేస్తుందన్నారు. ఇలాంటి మతతత్వ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బీజేపిని గద్దె దించడం కమ్యూనిస్టులకే సాధ్యమని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ .. భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు నెలకొల్పాలని దాంతో నిరుద్యోగం తగ్గుతుందని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అంగట్లో సరుకుల లాగా అమ్ముతున్నాడని అన్నారు. సింగరేణి ప్రైవేట్ పరం చేయనని చెప్పి తెలంగాణ ప్రజలను కార్మికులను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కి వేస్తూ ఈడి, సిబిఐ విచారణల పేరుతో భయాందోళన గురి చేస్తూ తెలంగాణకు రావలసిన హక్కులను నిధులను అభివద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. బీజేపిని రాబోయే రోజుల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు.సింగరేణి ఎన్నికల్లో పొత్తులు ఉండవు ఒంటరిగానే పోటీ సింగరేణి ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తులు ఉండవని సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయడం జరుగుతుందని సాంబ శివరావు స్పష్టం చేశారు. త్యాగాల చరిత్ర గలిగిన ఏఐటీయూసీని కార్మికులంతా మరోసారి గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఎర్ర చెరువులో సుమారు 3000 మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలందరికీ ప్రభుత్వం 58, 59 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలని అట్లాగే పోడు వ్యవసాయం చేసుకున్న రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజల హక్కుల సాధించేంతవరకు దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారధి రెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, హనుమకొండ జిల్లా కార్యదర్శి, కర్రె బిక్షపతి ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు, సిపిఐ కంట్రోల్ కమిటీ సభ్యులు విశ్వేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, బాష్మియా ,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరు జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొరిమి సుగుణ, ఎం సాదాలక్ష్మి, ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.