Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ - ములుగు
విభజన హామీలతో పాటు నిరంకుశ విధానాలను అవలంభి స్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్దం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు పిలుపుని చ్చారు. ఈ నెల 25న బయ్యారంలో ప్రారంభం అయిన పోరు యాత్ర బుధ వారం ములుగు జిల్లాలోని మల్లంపల్లి గట్టమ్మ వద్దకు చేరుకుంది. పాద యాత్రగా ములుగు జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ సెంటర్లో, జంగాలపల్లి వధ్ద ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జంపాల రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ములుగు జిల్లా కమలాపురంలోని బిజిపిపిఎల్ను నేటి వరకు తిరిగి ప్రారంభించ లేదని అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన విభజన హమీలైన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షలు, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని అన్నారు. కుట్ర పూరితంగా పార్లమెంట్ సభ్యులను సైతం అనర్హులుగా ప్రకటించడం దారునమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తిరుగు బాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోడుభూములు, డబుల్ బెడ్రూం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. టీిఎస్పిఎస్ అవినీతి మూలంగా నిరుద్యోగ యువత పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు. ములుగు, భూపాలపల్లి,హన్నకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శులు తోట మల్లిఖార్జున రావు, కొరిమి రాజ్‌కుమార్,కర్రె బిక్షపతి,మేకల రవి,విజయసారథి, రాజారెడ్డి,, రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, నేదునూరి జ్యోతి,మండ సదాలక్ష్మి,, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ముత్యాల రాజు, బండి నరసయ్య, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.