Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వే స్తుందని ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అన్నారు. బుధ వారం మండలంలో కోటి యాభై నాలుగు లక్షల తొంభై వెయ్యిలతో (154.90లక్షలు) పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. పర్లపెల్లి గ్రామంలో గౌడ కమ్యూ నిటీ హాల్, సీసీ రోడ్లు,పెద్దకోమటిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణం,గౌడ కమ్యూ నిటీ హల్,అకినపల్లి గ్రామంలో సిసి రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణ పనులు,ఇప్పలపల్లి గ్రా మంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్ల పనులకు శంఖుస్థాపన,నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ పల్లెల్లో దాదాపుగా మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నా యన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, లైటిం గ్స్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో నిర్వహించే ఉత్తమ గ్రామ పంచాయతీల్లో మొదటి వరుసలో తెలంగాణ పల్లెలు నిలిచాయ న్నారు. ప్రతి గ్రామానికి రైతు వేదికలు నిర్మించి రైతులను సంఘటితం చేసి,ఆహ్లాదకరమైన వాతా రణం కోసం పల్లె పకృతి వనాలు, క్రీడ మైదానాలు ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కంటి వెలుగు ద్వారా అందత్వ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారనానరు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు నిర్మించి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చిన ఎదుర్కునేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఆందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కోట్లు తీసుకుంటున్న కేంద్రం తిరిగి రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో జాప్యం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, జెడ్పి టిసి జోరుక సదయ్య,వైస్ ఎంపీపీి రాజేశ్వర్‌రావు, పీిఏసీఎస్ చైర్మన్ నరసింగరావు, డీఈ ఆత్మారావు, ఏ ఈ రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
గ్రామాల్లో దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా ఉన్న సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వ యంతో పరిష్కరించే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీి యార సుజాత సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లా డారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మూడు నెలలకి ఒక్కసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. వేసవి దృష్ట్యా ఇరిగేషన్, అర్ డబ్ల్యూ ఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం మం డలంలో దిగ్విజయంగా కొనసాగుతున్నదని వైద్య శాఖ అధికారులను అభినందించారు. ఇప్పటివరకు మండలంలో దాదాపు 15000మందికి కంటి పరీక్షలు నిర్వహించుకోగా 13000 మందికి అద్దాలు అందివ్వడం జరిగిందని వైద్యాధికారిని నాగరాణి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న కరెంటు స్తంభాలు,కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంగా రూ. 10000 అందిస్తున్న తరుణంలో పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపించాలన్నారు. అనంతరం మండ లానికి సంబంధించిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ. 32 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన పిడిసిల్ల సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,కార్యదర్శి శ్రీకాంత్ ను మెమోంటో అందజేసి ఘనంగా సన్మానించారు. తహశీల్దార్ సుమన్, జెడ్పిటిసి జోరుక సదయ్య, పిఏసీఎస్ చైర్మన్ నరసింగరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, ఎంపీడీవో కృష్ణవేణి పాల్గొన్నారు.-