Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పట్టణ కేంద్రంలోని పుట్టకోట బజారులో మరమ్మత్తుల కు గురైన చేతి పంపుకు తక్షణమే మరమ్మత్తులు చేయించాల ని పుట్ట కోట బజార్‌కు చెందిన ప్రజలు పంచాయతీ పాలక వర్గాన్ని, పంచాయతీ అధికారులను కోరుతున్నారు.గత సం వత్సరం కాలంగా మరమ్మత్తులకు గురైన చేతి పంపును పట్టించుకోకపోవడం పంచాయతీ పాలనకు నిదర్శనంగా చ ెప్పవచ్చు. దశాబ్ద కాలం క్రీతం జడ్పీ నిధుల సహకారంతో ని ర్మించిన ఈ చేతి పంపు పుట్టకోట బజార్ మొత్తానికి చెందిన ఇండ్లకు సరిపడా నీటిని అందించిందని ఇప్పుడు మరమ్మత్తు లకుగురై నిరుపయోగంగా ఉన్న పట్టించుకునే నాథుడే కరు వైనాడని మహిళలు,ప్రజలు అరోపిస్తున్నారు.వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి నివారణకు అధికారులు,ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు ఎన్ని సార్లు చెప్పిన వాటిని అమలు చేయడంలో పంచాయతీ పాలకవ ర్గం, అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు పట్టణ ప్రజల నుండి వినిపిస్తున్నాయి.గ్రామ పంచాయతీ నిధుల నుండి స్థానికంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి కొంతమేరకు నిధులు ఖర్చు చేయాలనే ప్రభుత్వ నిబంధన లు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయడం లేదని ప్రజలు అరో పిస్తున్నారు. ఒకవైపు తీవ్రమైన వేసవి కాలం సమీపిస్తుం దని, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడం వంటి సమస్య తరుముతూ వస్తుంది. ఈ క్రమంలో గత అయిదు రోజులుగా అటు మిషన్ భగీరథ నీరు, ఇటు పంచాయతీ నుండి పంపు నీరు రాక ఈ ప్రాంత ప్రజలు నీటికి కట కట లాడుతున్నారు. నీటిని సంవృద్దిగా అందించే ఇలాంటి నీటి వనరులు అందించే చేతి పంపును రిపేర్ చేయించకపోవ డం నీటి సమస్య పట్ల పాలక వర్గానికి ఉన్న శ్రద్ధను తెలుపు తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.మిషన్ భగీరథ నీటి సరఫరా పై నమ్మకంతో ఇలాంటి స్దానిక నీటి వనరుల ను పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.నీటి సమస్య మరింత తీవ్రం కాకముందే అధికారులు, పాలకులు స్పందించి పట్ట ణంలో మరమ్మత్తులకు గురైన చేతి పంపులను యుద్ధ ప్రాతి పాదికన మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుక వ చ్చి ప్రజల నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.ఈ విష యమై పంచాయతీ కార్యదర్శి కుమారస్వామిని వివరణ కోర గా సర్పంచ్ దృష్టికి తీసుక వెళ్ళి మరమ్మత్తులకు గురైన బోరు లను పరిశీలించి మరమ్మత్తులు చేయించడానికి కృషి చేస్తా మని చెప్పారు.