Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
కాంగ్రెస్ పార్టీ పద్ధతులు నచ్చక పెంబర్తి గ్రామానికి చెందిన పంపర మల్లే శం తిరిగి సిపిఎం పార్టీలోకి తిరిగి వచ్చారు. జనగాం మండలం పెంబర్తి గ్రామా నికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు పంపర మల్లేశం అక్టోబర్లో వ్యక్తిగత కారణాల వలన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ పద్ధతులు నచ్చక తిరిగి తన మాతృసంస్థ అయిన సిపిఎం పార్టీలో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మి నేని వీరభద్రం సమక్షంలో మార్చి 29న హైదరాబాదులో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ మండల కమిటీ పెంబర్తి శాఖ గ్రామ కమిటీ పం పర మల్లేశంని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నా పార్టీలోనే ఉంటే నాకు గర్వంగా ఉంటుందని సు మారు 45 సంవత్సరాలు పాటు మున్సిపాలటీలో పని చేయడం జరిగిందని పంపర మల్లేష్ సందర్భంగా అన్నారు. నాకు పార్టీలో తిరిగి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్య దర్శి ఎం.కనుకారెడ్డి మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో గత 70 సంవత్సరా లుగా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పో రాటాల నిర్వహిస్తున్న పార్టీ సిపిఎం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార సత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న అన్నారు.జనగామ జిల్లాలో రైతులు కార్మికు లు కర్షకులు వృత్తిదారులు మహిళలు యువకులు విద్యార్థులు మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ సీపీఎం అన్నారు.దేశంలో సమ సమా జం స్థాపించేంతవరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. దేశంలో బిజెపి పాలన ప్ర జలకు శాపంగా మారిందన్నారు. కోటీశ్వరులకు వరంగా నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుంది అన్నారు.నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లను తిప్పి కొట్టడం కోసం దేశవ్యాప్తంగా సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుంద న్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాల్లో యువతి యువకు లు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, మండల కార్యదర్శి బోడ నరేందర్, జిల్లా కమిటీ సభ్యులు పి ఉపేందర్,పెంబర్తి గ్రామ నాయకులు బొడ్డు, వెంకటేష్, ఎంటుక ఆంజనేయులు, సిహెచ్.పరశురాములు, నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు.