Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
దంతాలపల్లి గ్రామపంచాయతీ పాలక వర్గ సమావేశాలకు పలుమార్లు హా జరు కాకుండా సర్పంచి గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారని వార్డు సభ్యులు సో మేశ్వర్, నాగేష్, ఉప్పలయ్య, కిషన్, శ్రవణ్, ఉపేంద్ర ఆరోపించారు. గ్రామ పంచాయతీలో బుధవారం నిర్వహించిన సమావేశానికి సర్పంచి హాజరు కాలేద ని వారు ఆరోపించారు. తీర్మానాలపై సంతకాలు చేయకుండా తీర్మాన పత్రాల ను వారి దగ్గర పెట్టుకొని జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయన్నారు. దీనికి నిదర్శనం గ్రామపంచాయతీలో వెల గని విద్యుత్ లైట్లు నిదర్శనం అన్నారు ఈ విషయాన్ని సర్పంచి సుస్మిత వద్ద నవ తెలంగాణ ప్రస్తావించగా తన సోదరి భర్త మృతితో సమావేశానికి హాజరు కావ డం లేదని, ఈ విషయాన్ని వార్డు సభ్యులకు తెలియజేయమని పంచాయతీ కా ర్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు గ్రామానికి 30 లక్షల దాంక అభివృద్ధి పనులు చేశాను నేటికీ బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోటి పనులు చేయలేకపోతున్నానన్నారు.