Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్
నవతెలంగాణ-దేవరుప్పుల
పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రామీణ జాతీయ ఉపాధి పథకంలో పని చేసే కూలీలకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగార రమేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఉపాధి కూలీలతో సమస్యలను చర్చిం చారు.అనంతరం కామారెడ్డి గూడెం ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్య లను తెలుసుకున్నారు. ఏప్రిల్ ఐదవ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే మ హాధర్న కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.అనంతరం మహాధర్నా గోడపత్రికను అవిష్కరించారు. కా మారెడ్డి గూడెం గ్రామంలో గత సంవత్సరంగా ఉపాధి కూలీలకు పనిచేసిన డబ్బులు రాకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై శుక్ర వారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గోడిశాల రాములు, చింత సోమయ్య, అబ్బయ్య, విజయ, నీర్మల,పద్మ, నర్సమ్మ,సోమలక్ష్మి, విజయ కూలీలు పాల్గొన్నారు.