Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణంన్ని ఘనం గా నిర్వహించారు. నర్మెట్ట మండల కేంద్రంతో పాటు హను మంతపూర్, మచ్చుపహాడ్, వెల్దండ, అమ్మపురం, గ్రామాల్లో శ్రీ సీతా రాముల కల్యాణంన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్లులు రామిని శివరాజు, సర్పంచుల పోరం అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, జగన్మోహ న్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు నర్మెట్ట తరిగొప్పుల మండ లా కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి మాజీ సర్పంచ్ భూక్య జయరాం, ఆలయ అర్చకులు ప్రయాగ నాగభూషణం శర్మ, బైరగొని రాజు, గుండేటి నాగపూరి రాజు, బైరగొని మల్లేష్, భక్తులు రామిని రాజు, అన్నదానం దాత రాపర్తి వేణు పాల్గొన్నారు
తరిగొప్పుల : శ్రీరామనవమి సందర్భంగా మండల కేం ద్రంతో పాటు పలు గ్రామాలలో అంగరంగ వైభవంగా భకి ్తశ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకగా ప్రముఖుల స మక్షంలో గురువారం జరుపుకున్నారు. మండల పరిధిలోని అక్క రాజు పల్లి గ్రామంలో సర్పంచ్ అమీర్ శెట్టి వీరేందర్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ని ర్వహించగా ఇట్టి కళ్యాణానికి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్నాగబండి ఉమా, నరసింహ, రాములు స్వామి వారి కి పట్టు వస్త్రాలు సమర్పించగా, రెయిన్బో యూత్ అసోసి యేషన్ తరపున కళ్యాణ మండపం ఏర్పాటు చేయించి కళ్యా ణం జరిపించారు. అనంతరం దాతల సహాయంతో అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ సారధ్యంలో వైభవంగా సీతారాముల కళ్యాణ మహౌత్సవం
దేవరుప్పుల : శ్రీరామ నవమి పురస్కరించుకొని పెద్ద మడూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహౌత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. గ్రామానికి చెందిన యువ నాయకుడు బబ్బూరి రమా శ్రీకాంత్ గౌడ్ దంపతులు కళ్యాణ మహౌత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులకు పు స్తె మట్టెలు, గుడికి సర్వాంగ సుందరంగా రంగులు భక్తజనా నికి మహా అన్నదానం, మైక్సెట్లు బహుకరించడం జరి గింది. వారి సారాద్యంలో వధూవరులుగా కారుపోతుల సత్త య్య బండారి రాములు దంపతులు కూర్చోగా ఆలయ అర్చ కుడు మూటకొండూరు శ్రీనివాస్ శర్మ వేదమంత్రోత్సవాల మధ్య ఉత్సవ కళ్యాణమూర్తులను ఊరేగింపు చేసి లక్ష్మణ సమేత సీతారాములను కళ్యాణ వేదిక పైకి తీసుకువచ్చి కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు. కార్యక్రమం లో గ్రామసర్పంచ్ ఆకవరం సృజనా పెద్దారెడ్డి, ఉప సర్పంచ్ మానుపాటి వెంకటేష్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు నల్ల ఉమేష్, ఆలయ కమిటీ మెంబర్స్ బబ్బూరి నాగరాజు గౌడ్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, దుబ్బ రాజశేఖర్ గౌడ్, నల్ల ఉమేష్,నాయకపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మానుకోటలో కళ్యాణం మహోత్సవ వేడుక
మహబూబాబాద్ : పట్టణంలో గాంధీ పార్క్ ఎదురుగా శ్రీ సీతారాముల కల్యాణ మహౌత్సవ వేడుక ఘనంగా ని ర్వహించారు.గురువారం శ్రీరామనవమి సందర్భంగా మహ బూబాబాద్ పట్టణంలోని రామాలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సీతారాముల విగ్ర హాలను రామాలయం నుండి నెహ్రూ సెంటర్ మీదుగా ఊ రేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదానం పప్పు ప్రసా దం, పానీయం, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న మారినేని రఘు, డా.అనిల్ గుప్తా, బోనాగిరి గంగాధర్, మాలె నాగేశ్వరరావు, గద్దె రవి, యాళ్ల మురళీధర్ రెడ్డి, గుండా రాజశేఖర్, నాయిని రంజిత్, చిట్యాల జనార్ధన్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బయ్యారం : మండలంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండ రామస్వామి ఆలయంతో పాటు, పలు గ్రామాల్లోని రామాలయాల్లో ఘ నంగా జరిగాయి. ఉదయమే మంగళ వాయిద్యాలు, గ్రామ పెద్దలు పల్లకీలో స్వామి వారి విగ్రహాలను ఊరేగింపుగా వెళ్లి సీతారాములకు మంగళ స్నానాలు చేయించి పట్టువస్త్రాలు కట్టి వేద మంత్రాలు, మంగళవాయుద్యాల నడుమ సీతారా ముల కళ్యాణం వైభవంగా జరిగింది. పలు ఆలయాల నిర్వా హకులు భక్తులకు పులిహౌర, బెల్లం పానకం ఇచ్చారు. ప లు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండలంలోని తాళ్ల పూస పల్లి, కలవల, కోరుకొండ పల్లి, ఉప్పరపల్లి, కేసముద్రం విలేజ్, గ్రామాలలో శ్రీ సీతారామ వారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా తాళ్ల పూసపల్లి గ్రామంలో సీత, రాముడు, లక్ష్మణ ఉత్సవ విగ్రహా లను పంచలోహాలతో తయారు చేయించి కళ్యాణ మహౌ త్సవం ఘనంగా నిర్వహించారు.తాళ్లపూసపల్లి గ్రామ సర్పం చ్ రావుల విజిత రవిచంద్ర రెడ్డి, కలువల గ్రామ సర్పంచ్ గంట సంజీవరెడ్డి, ఎంపీటీసీ గంట అశోక్ రెడ్డి, కోరుకొండ పల్లి గ్రామ వాస్తవ్యులు మహబూబాబాద్ మున్సిపల్ చైర్ప ర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కోరుకొండపల్లి గ్రామంలో కళ్యాణ మహౌత్సవంలో ఉప్పరపల్లి శ్రీ శివరామగిరి క్షేత్రం లో సీతారామ కళ్యాణం గుడి ప్రాంగణంలో ఘనంగా నిర్వ హించారు. గ్రామ ఇంచార్జి సర్పంచ్ ఎలబోయిన సారయ్య, గట్టు ఉపేందర్, పల్లె వీరస్వామి, బండారు వెంకన్న, అరిగే విజేందర్, ఎసల్ల సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని పార్టీ మీద శ్రీ సీతా రామ మందిరంలో గురువారం తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చా సురేష్, సీతారామ భక్తమండలి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఆలయాన్ని అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలం కరించారు.మండపం వేసి శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లో భారీగా చలువ పందిళ్లు వేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు కొల్లా వజ్జుల రమేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి కల్యాణ వేడు కలు ప్రారంభమయ్యాయి. ముందుగా హౌమం, తర్వాత ఎదుర్కోళ్లు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వా మివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం నివే దన, మూలవరులకు అభిషేకం చేశారు. మంగళాశాసనాలు పఠించారు. భక్తుల కోలాహలం నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కల్యాణ పీఠంపై ఉత్సవమూ ర్తులను ప్రతిష్ఠింపజేసి రామయ్య గుణగణాలు, సీతమ్మ అణ కువ, అందచందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతా రాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్రప్రాశ స్త్యం, కల్యాణ మహౌత్సవ విశిష్ఠతను భక్తులకు వివరించా రు. భక్తుల హర్షధ్వానాల మధ్యాహ్నం 12 గంటలకు అభి జిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీల కర్ర బెల్లం ఉంచారు. సీతమ్మ మాంగల్యధారణ ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. మధ్యాహ్నం 2గంటల వరకు వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణ మూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చా సురేష్, ప్రధాన కార్యదర్శి బోనగిరి శంకర్, కోశాధికారి శ్రీనివాస్, సత్యనారాయణ, చక్ర పాణి,బిజ్జాల నారాయణ,బిజాల కృష్ణమూర్తి, పంజాల ఉపేం దర్, వెంకటేశ్వరరావు, సంకటాల సోమేశ్వరరావు, గంజి విజ య పాల్ రెడ్డి, ఉప్పల నాగేశ్వరరావు, దొడ్డ రఘు, దామెర సరేష్, రేగూరి శ్రీనివాస్, శ్రీధర్, మచ్చ లక్ష్మయ్య, నాగన్న, ఇమ్మడి రాంబాబు, చంద్రమౌళి, కృష్ణమూర్తి, కార్యవర్గ స భ్యులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : మండలంలోని తండ ధర్మారం గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలలో మరి పెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, మాజీ ఎంపీపీ వెంకన్నతో కలిసి పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం పురోహితుని వేద మంత్రాల నడుమ విచ్చేసిన భక్తుల సమక్షంలో కళ్యాణం ఘ నంగా జరిపించారు. అనంతరం తండ ధర్మారం ఆలయ క మిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమా న్ని ఎంపీపీ అరుణ రాంబాబు, మాజీ ఎంపీపీ వెంకన్నతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి లక్పతి,మాజీ సర్పంచ్ బాబు నాయక్,బాలకిషన్ గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కమనీయం...రాములోరి కళ్యాణం !
బచ్చన్నపేట : శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా మండల కేంద్రంతో పాటు గ్రామా లలో గురువారం స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిం చిన తర్వాత ఘనంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మండల ప్రజలు, మరియు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యా లతో ఎల్లవేళలా ఆ ఆదర్శ దంపతులు దీవెనలతో ఆనందం గా ఉండాలని కోరుకున్నారు. మండలంలోని చెన్నకేశవ ఆల యంలో, భక్త మార్కండేయ ఆలయంలో, పోచన్నపేటలో, ఎద్దుగూడెం ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగానిర్వహించారు.ఆయా గ్రామాలలోని భక్తు లు పాల్గొని స్వామివార్ల దీవెనలు అందుకున్నారు. ఈ కార్య క్రమంలో కొత్తపల్లి రాజమౌళి దంపతులు, భక్త మార్కండేయ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
లింగాలఘనపురం : ఆలయ అర్చకులు వేదపండితల మంత్రోచరణతో పులకించిన వీరాచల క్షేత్రంలో శ్రీ సీతారా ముల కళ్యాణం కమనీయం, రమనీయంగా కనుల పండగ అంగరంగ వైభవంగా గురువారం జరిగింది. మండలంలోని జీడికల్ గ్రామంలోని దేవస్థానం కళ్యాణమండపం(వీరాచల క్షేత్రం) నందు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన వీ రాచల జీడికంటి శ్రీరామచంద్రస్వామి వారి కళ్యాణ మహౌ త్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల పండిత బృందం కళ్యాణమహౌత్సవం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో 86 మంది పుణ్యదంపతుల సమ క్షంలో సుమారు మూడు గంటల పాటు శాస్త్రోక్తంగా కళ్యా ణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యకి జీడికల్ దేవస్థానానికి చేరుకోగా ఆలయ అర్చకులు తీరు మట్టం చుట్టి వేదపండితుల, పురోహితుల వేద మంత్రోచ్ఛా రణలతో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ఎంతో మహిమాన్వితమైన ప్ర సిద్ది చెందిన జీడికల్ శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థాన అభివృద్ధికై కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీ చిట్ల జయ శ్రీ ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మధు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచులు రాజు,గణపతి, ఎంపిటిసిలు మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు, ముఖ్యనాయకులు భాగ్యలక్ష్మి విష్ణు, శ్రీవారి, పార్టీ శ్రేణులు, ఆలయ అర్చకులు, వేదపండితులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్క రించుకొని మండల కేంద్రంలోని దొడ్డు గుట్ట దగ్గర వెలసిన శ్రీ అయోధ్య రామస్వామి దేవాలయం వద్ద గురువారం ఆల య ప్రధాన ధర్మ కర్తలైన పాశం నిరంజన్, పాశం దయా కర్, పాశం రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులైన సంతోష్, పెండిపోలు శ్రీనివాస్ వేద మంత్రోచ్ఛారణల నడు మ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహౌత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. రఘునాథపల్లి గ్రామపంచాయతీ తరఫున సర్పంచ్ పోకల శివకుమార్-లావణ్య దంపతులు, ఎంపీటీసీ పెర్నె ఉష-రవితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, పుస్తెలు మట్టెలు సమర్పించి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యా ణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పంచాయతీ తరుపున సర్పంచ్ పోకల శివకుమార్ ఆలయం వద్ద ఏర్పాట్లతో పాటు, బస్సు సౌక ర్యం, తాగడానికి మంచి నీరు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కల్యాణానికి వచ్చిన భక్తులు దేవాలయం వద్ద చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బొల్లం మణికంఠ (అజరు) ఎంపీపీ మేకల వరలక్ష్మీ నరేందర్, రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ వీరేందర్ దంపతులు, శ్రీ మహాదేవ స్వామి ఆలయ చైర్మన్ కూరెల్లి ఉపేందర్, గ్రామ ఉపసర్పంచ్ యాద రాములు, వార్డు మెంబర్స్ నీలం వాసు, చీమలపాటి రామారావు, టిడి పి రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల మల్లేష్, టిడిపి మండల పార్టీ అధ్య క్షుడు బొక్క రామచంద్రయ్య (చంద్రబాబు), బీజేపీ నియో జకవర్గ నాయకుడు సాయి రెడ్డి విజరు భాస్కర్ రెడ్డి, టిఆర్ ఎస్ పార్టీ నాయకుడు జెరిపోతుల మహేందర్, పోరెడ్డి రా ఘవ రెడ్డి, దుబ్బాక యాదగిరి, పోరండ్ల శ్రీకాంత్,ఓరుగంటి శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : మండలంలోని మాటేడు, పోలేపల్లి వివిధ గ్రామాలలో వేణుగోపాలస్వామి, రామలింగేశ్వర స్వా మి ఆలయ ప్రాంగణంలో గురువారం శ్రీరామనవమి వేడు కలు వైభవంగా నిర్వహించారు.ఆలయాన్ని అందంగా విద్యు ద్దీపాలు, పూలతో అలంకరించారు.మండపం వేసి శ్రీ సీతా రాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు వేసి, ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సం ఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు కొల్లా వజ్జుల రాధా కృష్ణ, దేవేంద్రాచారి బృందం ఆధ్వర్యంలో ఉదయం 10గంట ల నుంచి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా హౌమం, తర్వాత ఎదుర్కోళ్లు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం నివేదన, మూలవరులకు అబిషేకం చేశారు. మంగళాశాసనాలు పఠించారు. భక్తుల కోలా హలం నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొ చ్చారు. కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠింపజేసి.. రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అందచందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్రప్రాశస్త్యం, కల్యాణ మహౌత్సవ విశిష్ఠతను భక్తులకు వివరించారు. భక్తుల హర్షధ్వానాల మ ధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మ మాంగల్యధారణ ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. మ ధ్యాహ్నం 2గంటల వరకు వేడుకలు జరిగాయి. భారీ సంఖ్య లో భక్తులు హాజరయ్యారు.తీర్థ ప్రసాద వితరణ, మహాన్న దానంతో కార్యక్రమాలు ముగిశాయి.ఈ కార్యక్రమంలో స ర్పంచ్ వల్లపు శోభ యాకయ్య, పోలేపల్లి గ్రామ సర్పంచ్ పందుల యాకయ్య, ఏఎంసీ చైర్ పర్సన్ వసుమర్తి శాంతా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు,ఉప సర్పంచ్ పినాకపాణి,ఆలయ కమిటీ ప్రతినిధులు సముద్రాల శ్రీనివాస్, కల్వకొలను ప్రవీణ్ రాజు, కల్వకొలను జనార్దన్ రాజు, లేగల కొంరారెడ్డి,లేగల వెంకట్ రెడ్డి, దీకొండ బిక్షపతి, కల్వకొలను సురేందర్ రాజు, తాళ్ల మల్లయ్య, ఎర్ర అంజ య్య,మదార్, నరసింహ రెడ్డి, ఆలయ ఈవో వేణుగోపాల్, కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్
ఏఐపీసీ నాయకులు డా. బోల్లేపల్లి క్రిష్ణ
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నిత్యం ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఏఐపీసీనాయకులు, ఎస్ఎస్కే వైద్య సంస్థల అధినేత, ప్ర ముఖ గుండె వైద్య నిపుణులు, డా. బోల్లేపల్లి క్రిష్ణ అన్నారు. గురువారం మండలంలో తాటికొండ గ్రామంలో శ్రీ సీతా రామ కళ్యాణ మహౌత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, సీని యర్ నాయకులు బేతి రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడమ కట్టమల్లు, జిల్లా ఓబీసీ కోఆర్డినేటర్ చల్లా తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కోరుకొప్పుల మధు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండె యాదగిరి, గూడెల్లి యాదగిరి, మారపాక శ్రీనివాస్, మెరుగు రాజయ్య, భూక్య చంద్రు నా యక్, పులిగిళ్ళ రాజయ్య, తదితరులు పాల్గోన్నారు.
కన్నుల పండువగా సీతారామ కళ్యాణం
కన్నుల పండువగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామం లో శ్రీ బుగులు వెంకటేశ్వర ఆలయ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీరామ చంద్రుడి కళ్యాణ మహౌత్సవానికి భక్త జన ప్రవాహం ఉప్పొంగింది.అర్చకులు, వేదపండితుల వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజయ్య హాజరై, సీఎం కేసీఆర్ వచ్చాక దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నారని, ప్రజలకు మేలు కల్గే విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి పనులు జరుగు తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జీ ఆకుల కుమార్, డైరెక్టర్లు శ్యాం రెడ్డి, రంగు హరీష్, వేల్పుల గట్టేష్, ఉప సర్పంచ్ బత్తిని శ్రీను, కారోబార్ జీడి ఆనందం, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : శ్రీ రామ నవమి వేడుకలను మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు,గ్రామపెద్దలు, భక్తులు గురువారం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, పర్చూరి కుటుంబరావు దంపతులు, అంజ నేయ స్వామి ఆలయంలో అర్యవైశ్య వర్తకులు, పుట్ట కోటలో ని రామాలయం, అంబేద్కర్‌నగర్‌లో, పినిరెడ్డిగూడెం అంజ నేయ స్వామి ఆలయంలో, సీతంపేటలోని రామాలయం లో, చిన్న కిష్టాపురం, ముల్కనూరు, పెద్ద కిష్టాపురం, గోపాల పురం అంజనేయ స్వామి ఆలయంలో,మర్రిగూడెం, పోచా రం, కోట్యానాయక్ తండా, ముత్తితండా, పుల్లూరు, రాజు తండ, బుద్దారం, రాంపురం, మద్దివంచ, శేరిపురం, బాలాజీ తండా అయా గ్రామాలలో పండితుల వేదమంత్రాల నడు మ, మేళతాళాలతో,భక్తుల కోలాహలం నడుమ కోదండ రా మస్వామి-సీతా దేవి దంపతులకు కళ్యాణ మహౌత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాలలో భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నసం తర్పణ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని స్వా మి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కళ్యాణ మహౌ త్సవం వేడుకలలో అయా పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపి టీసిలు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, భక్తులు, ప్రముఖులు తదితరులు ఉన్నారు.