Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
శ్రీరామ సుగుణధామ రఘువంశ జలధి సోమ..సీతా మనోభిరామ సాకేత సార్వభౌమా... అంటూ శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. భక్తులు పెద్ద ఎ త్తున ఆలయాలకు తరలివచ్చారు. జగదానందుడి కళ్యాణాన్ని క నులారా వీక్షించి, ఊరువాడ పులకించింది. వినయ గుణ సంప న్నుడు.. శ్రీరామచంద్రుడు.. జానకి మాతను తన దేవేరిగా చేరు కున్న అరుదైన సందర్భం. లోకనాయకుని దివ్య కల్యాణోత్సవం విశ్వ కళ్యాణంగా భాసిల్లింది. మంగళ స్నానాలు.. కంకణ ధార ణలు.. నూతన వస్త్రాలంకరణలు.. ముత్యాల తలంబ్రాలు.. పం డితుల వేదమంత్రాల ఘోషతో రాములవారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేసిన ఘట్టం నేత్రానందాన్ని కలిగించింది. వ రంగల్, హనుమకొండ జిల్లాల్లోని ప్రధాన రామాలయాలతో పా టు గ్రామీణప్రాంతాల్లోని ఆలయాల్లో స్వామివారి పెళ్లి సంబ రాలు అంబరాన్ని తాకాయి. శ్రీరామ, జయరామ.. జయ జయ రామ. పారాయణాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగ ణాలు మార్మోగాయి. భక్తులే పెళ్లి పెద్దలుగా మారి సీతమ్మను రా మునికి కన్యాదానం చేశారు కానుకలను సమర్పించి భక్తి సాగ రంలో మునిగిపోయారు. శ్రీ సీతారాముల పెళ్లి సందడిని కను లారా వీక్షించి తరించారు. భక్తితో ప్రణమిల్లి పారవశ్యం చెందా రు. వడపప్పు పానకాలను ప్రసాదంగా స్వీకరించారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. పోటెత్తిన భక్తులతో రామమందిరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కాగా. ఆయా జిల్లాల్లో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణ వేడుకల్లో జిల్లా మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, జిల్లా పరి షత్ చైర్మన్లు, కలెక్టర్లు తో పాటు తదితర ప్రముఖులు, అధికారు లు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆదర్శ దంపతులను దర్శించుకు ని మొక్కలు చెల్లించారు.
గురువారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హంటర్ రోడ్ న్యూ శాయం పేట 31 డివిజన్ లోని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్న ప్రజలకు ఆలయాల అర్చకులకు భక్తులకు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ , డివిజన్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వేలేరు : వేములవాడ దేవస్థానం దత్తత తీసుకున్న మండల కేంద్రం వేలేరులోని రుద్ర రామేశ్వరాలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా అంగరంగ వైభవంగా సీతారాముల క ళ్యాణం నిర్వహించారు. ఉదయంనుండే గ్రామంలో కల్యాణ ఉత్స వ కార్యక్రమంలతో కోలాహాలం కనిపించింది. స్వామి వారికి వె న్నవరం చంద్రశేఖర్ రెడ్డి, మొగిలిచెర్ల సుదర్శనం, డాక్టర్ వేంకట ేశ్వర్లు, బొల్లికొండ రాజు, కాసం రాజిరెడ్డి దంపతులతోపాటు గ్రామస్తులు పట్టు వస్త్రాలు పుస్తె మట్టెలు సమర్పించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, ఉపసర్పంచ్ సద్దాం హుసేన్, ఎంపీటీసీ ఇట్టబోయిన సంద్య, వార్డు సభ్యుల దంపతులు స్వామి వారి తలంబ్రాలు సమర్పిం చారు. ఆలయ అర్చకులు సత్యనారయణ శర్మ, పరమేశ్వర శర్మ క ళ్యాణ మహౌత్సవాన్ని అశేష భక్తుల మద్య రామనామ స్మర ణంతో ఘణంగా నిర్వహించారు. కార్యక్రమంలో పురప్రము ఖు లు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
పరకాల : కళ్యాణ కమనీయం అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో సీతారాముల కళ్యాణ మహౌత్సవాలను ఆలయాల ప్రధానార్చకులచే గురువారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయం ఆలయ కమిటీ డైరెక్టర్ బండి శ్రీధర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహౌత్సవాన్ని ఏర్పాటు చేయగా ఆలయ పూజారి భక్తుల సమక్షంలో వేదమంత్రాల ఉచ్చరణతో సీతారాముల కళ్యాణ మహౌత్సవాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనితా రా మకృష్ణ, వైస్ చైర్మన్ రేగురు జైపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప ట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తి లకించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మలకపేట భక్తాంజనేయ ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆలయ అర్చకు లు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా వేల సంఖ్యలో చుట్టు గ్రామాల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహౌత్సవంలో పాల్గొన్నారు. అలియాబాద్ గ్రామంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు శాతరాసి సనత్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహౌత్సవం నిర్వహించగా పరకాల మున్సిపల్ చైర్పర్సన్ షో ద అనిత రామకష్ణ, వైస్ చైర్మన్ రేగురు జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమాదేవి సుధాకర్‌రావులు పాల్గొనగా అర్చకులు సీతా రాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఈ వైభవంలో భక్తులు, ప్రజలు కళ్యాణ మహౌత్సవాన్ని చూసి పులకించి పోయారు అనంతరం అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. ప్రగతి సింగారంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వగ్రా మం ప్రగతి సింగారం గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహౌత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి దంపతులు రాముల వారికి పట్టు వస్త్రాలను సంప్రదాయబ ద్ధంగా సమర్పించారు. అ నంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మా ట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా ప్రజలకు కష్టాలు తొలగి, సుఖ సంతోషాలతో పాడిపంటలు మంచిగా పండాలని, నిరు ద్యోగ యువతకు ఉద్యో గ అవకాశాలు ఆ భగవంతుడి ఆశీస్సులు కల్పించి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, అందరూ చల్లగా ఉండాలని అన్నారు. అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో తీర్థప్రసాద తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
దామెర : దామెర మండలంలో ఒగ్లాపూర్, దామెర, ఊరుగొండ, దమ్మన్నపేట, లాదెళ్ల మొదలైన అన్ని గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా ప్రజలంతా ఐకమ త్యంతో జరుపుకున్నారు .ఒగ్లాపూర్ లో విగ్రహ దాత ఆకుల కుమారస్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం గ్రామ అభివద్ధి కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లు చేయించారు. ఊరుగొండలో సర్పంచ్ సత్యనారాయణరెడ్డి జరిపించారు. లాదెళ్లలో ఎంపీపీ కాగితాల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణం అనంతరం అన్ని గ్రామాలలో మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
శాయంపేట : మండల కేంద్రంలోని శివ మార్కండేయ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమిని పురస్కరించు కొని ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిం చారు. ఆలయ అర్చకులు మార్త రాజ్ కుమార్, రంగు యాదగిరి, ఆరుట్ల కృష్ణమాచార్యులు వేదమంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పం డుగగా కళ్యాణ మహౌత్సవాన్ని అంగ రంగ వైభవంగా నిర్వ హించారు.ఈ ఉత్సవాలలో పాల్గొన్న పి ఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, సర్పంచ్ కందగట్ల రవి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం చైర్మన్ శరత్, సీనియర్ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి మహా అన్నదాన కా ర్యక్రమం నిర్వహించారు. కొప్పులలో సర్పంచ్ గోలి మాధురి మ హేందర్ రెడ్డి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ లయ కమిటీ చైర్మన్ లు బాసాని సూర్య ప్రకాష్, సామల బిక్షపతి, ఉపసర్పంచ్ సుమన్, ప్రతాప్ సేనారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ప్రగతిసింగారంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో...
మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహౌత్సవా న్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహౌత్సవాన్ని ప్రజల జయ జయద్వానాల మధ్య జగదభిరాముడి కళ్యాణం వైభవంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషా లతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పో తూ సుమలత రమణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట : శ్రీరామ నవమి సందర్భంగా వివిధ దేవాల యాల్లో సీతారామ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం, అభయాం జనేయ దేవాలయం, రామాలయం, వేణుగోపాల స్వామి దేవాల యం, వల్లబ్నగర్లోని హన్మాన్ గుడిలో సీతారామ కళ్యాణ వేడు కలు కనులు విందుగా సాగింది. హిందూ శాస్త్రయుక్తంగా పూజా రుల మంత్రోశ్ఛరణల నడుమ ఈ కళ్యాణ వేడుకలను తిలకిస్తూ భక్తులు మంత్రముగ్ధులైయ్యారు. వాసవీ కళ్యాణ మండపం, రెడ్డి ఫంక్షన్ హాల్, పద్మశాలి గార్డెన్లోశ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహించారు. సర్వాపురం హన్మాన్ గుడిలో, గురి జాలలో సీతారామ కళ్యాణ వేడుకుల అంగరంగా వైభంగా సాగాయి.
దుగ్గొండి : జగదేక వీరుడైన శ్రీరాముడు, జగన్మాత సీతమ్మ తల్లి కళ్యాణోత్సవం గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిగింది.మండల కేంద్రంతో పాటు నాచినపల్లి, కేశవాపురం ఆలయాల్లో సీతారాముల కళ్యా ణం వైభవంగానిర్వహించారు.నాచినపల్లి, కేశవాపురం ఆలయా ల్లో సీతారాముల కళ్యాణం ఉత్సవాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని పుణ్య దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల రైతు కో ఆర్డినేటర్ తోకల నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ మంజుల ఆధ్వ ర్యంలో కల్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ ఉత్స వాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుఖసంతోషాలతో ఉం డాలని భగవంతుని కోరుకున్నారు. అనంతరం ఆలయాల్లో అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, శానబోయిన రాజ్ కుమార్, కామిశెట్టి ప్ర శాంత్, శంకేశి రమేష్, పోలోజు లింగమూర్తి, కూస రమేష్, కక్కర్ల ప్రమోద్, గుండెకారి రవికుమార్, ధర్మారెడ్డి,సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు భక్తులు పాల్గొన్నారు.
మట్టెవాడ : శ్రీ రామనవమి పురస్కరించుకొని గురువారం వాడ వాడల ప్రజలు సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపు కున్నారు. మామిడాకుల తోరణాలతో, పూల పందిళ్ళతో ఎంతో అందంగా ముస్తాబు చేసిన కళ్యాణ మండపాలలో సీతమ్మ తల్లిని శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేసే తంతు ఎంతో అపుర్వంగ నిర్వ హించుకున్నారు.వరంగల్ ఎంజీఎం వైద్యులు డాక్టర్ వాసుదేవ రావు ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని రామచం ద్ర అపార్ట్మెంట్లో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆకారపువారి గుడి ఆలయ ప్రధాన అర్చకులు లంక శివకుమార్ శర్మ పౌరహిత్యంలో రాములోరి కళ్యాణోత్సవం లో సీతమ్మ మెడలో రాములోరు తాళి కట్టి, తలంబ్రాలు పోసే తంతు కన్నులకు కట్టినట్లుగా, కనువిందుగా, మనసుకు హత్తు కునే విధంగా కొనసాగింది లోక కళ్యాణం ప్రజారోగ్యంన్నీ కాంక్షి స్తూ చేపట్టిన సీతారాముల కళ్యాణం లో అపార్ట్మెంట్ వాసులు ఎంతో ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
శ్రీ సీతారాములస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసం తోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివద్ధి పదంలో తీసుకువెళ్లడం జరుగుతుం దని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని పలు డివిజన్లలలో జరుగుతున్న శ్రీ సీతారాముల క ల్యా ణ వేడుకలలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గురు వారం పాల్గొన్నారు. 35వ డివిజన్ పుప్పాల గుట్టలో శ్రీ ముత్యా లమ్మ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహౌత్సవంలో పాల్గొన్న ఆయన స్వా మివారిని పూజించిన అనంతరం మాట్లాడారు.ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్,మర్రి శ్రీనివాస్,డివిజన్ ముఖ్య నాయకులు,డివిజన్ అధ్యక్షులు,యూత్ నాయకులు ఉన్నారు.
ఎల్కతుర్తి : శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం ఘనంగా, మండలంలో నిర్వహించారు. మండల కేంద్రంలో శివాలయంలో సర్పంచ్ కొమ్మిడి నిరంజన్ రెడ్డి దంప తుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా దామె ర, కేశవాపూర్, చింతలపల్లి, సూరారం, గోపాల్పూర్, పెంచికల పేటలో సర్పంచ్ సామల జమున సురేష్ రెడ్డి, దంపతులు సీతా రామ కళ్యాణం ఘనంగా నిర్వహించి నగర సంకీర్తన చేశారు.
నడికూడ : మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అలాగే మండలంలోని సర్వాపూర్, చర్లపల్లి, కంటా త్మకూర్ పలు గ్రామాల ఆలయాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహౌత్సవం లోక కళ్యాణర్థమై వేద పండితులతో, నడికుడలో గోపీనాథ్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కల్యాణమహౌ త్సవంలో గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు నిర్మల దంపతు లు, బోగి శ్రీలత రవీందర్, మేకల రమేష్, చాడ తిరుపతిరెడ్డి, అ లాగే బిఅర్ఎస్ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి (చందు)రజిత దంపతులు, ఎంపిటిసి మేకల సతీష్, కల్యాణ మ హౌత్సవంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాత దాతలు ఐనటు వంటి గోడిశాల శంకరయ్యసౌజ్ఞ దేవి, గోడిశాల రమేష్ రాధిక, గోడిశాల రాజేష్ జ్యోతి దంపతులకు నడికూడ గ్రామ ప్రజలు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి భక్తులు, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకున్నారు.
పర్వతగిరి : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మం డల కేంద్రంలో పర్వతగిరి గ్రామ సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ మహౌత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ టీసీ మాడుగుల రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రంగుకు మార్, వార్డు సభ్యులు అక్కల రేణుక, నాగుల బాబు, కంటెం ఏ కాంతం,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.అలాగే పర్వతగి రి మండల కేంద్రము లో గల శ్రీ పర్వతాల శివాలయం గుట్టకు శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని మండలం లోని ఆయా గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా వేసవి కాలము కావడం చేత తాగు నీటి కోసం గుట్టపై చిన్నపాక శ్రీకాంత్ చల్లనితాగునీటి సౌకర్యం కల్పించారు.అలాగే మండలం లోని కల్లేడ లో శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి ఆలయం లో వేడు కలు వైభవ్ఱోపేతంగా నిర్వహించారు.మండలం లోని ఏనుగల్ లో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలను వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిమిరెడ్డి కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మండలం లోని చింతనెక్కొండ లో శ్రీ రామాలయ ప్రాంగణం లో సర్పంచ్ గటిక సుష్మ ఆధ్వర్యం లో సీతారాముల కల్యాణ మహౌత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దేవేందర్, ఎంపిటిసి లు మౌనిక,సుభాషిణి,నాయకులు గటిక సురేష్, సా యిలు, శ్రీకాంత్,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే మండలంలోని వడ్లకొండ లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రంగనాయకస్వామి గుట్ట ప్రాంగణంలో సర్పంచ్, సర్పంచ్‌లో ఫోరం మండల అధ్యక్షుడు ఆమడగాని రాజుయాధవ్ ఆధ్వర్యం లో ఘనంగా పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ వుప్పలయ్య,యూత్ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నా రు. కొంకపాక శివాలయం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
కాశిబుగ్గ : సీతారాముల జీవితం యువతరానికి ఆదర్శ నీయమని రైతుబంధు సమితి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎల్ల వుల లలిత కుమార్‌యాదవ్ అన్నారు. వరంగల్ వ్యవసాయ మా ర్కెట్ సమీపంలోని ఎస్సార్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుక లను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లలిత యాదవ్ కళ్యాణ వేడుకలు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో హ న్మకొండ పిఎసిఎస్చైర్మన్ ఇట్యాల హరికష్ణ, తెలంగాణ ఉద్యమ కారుడు కేతిరి రాజశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మార్త సుభాష్, మచ్చర్ల స్టాలిన్, అర్చకులు రాచర్ల రాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు రాజ్ కుమార్, అశోక్, రాజవీరు, ప్రభాకర్, సత్యం, రాజు, సతీష్, రాజేందర్, సంతోష్, రాకేష్, చందు, అఖిల్, నరేష్, మహేష్ పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : ఊరురా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహౌత్సవ వేడుకలు నిర్వహించారు. సాయిరెడ్డిపల్లె, రెడ్లవాడ, పత్తిపాక, బొల్లికొండ, అలంకానిపేట, అప్పల్రావుపేట, వెంకటాపురం గ్రామాల్లో జరి గిన సీతారాముల కల్యాణ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పం చులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను తలంబ్రాలను సమర్పించి కళ్యాణ క్రతువులు జరిపించారు. అలంకాని పేట రామాలయం లో జరిగిన కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొ న్నారు. ఎమ్మెల్యే మండలంలోని పలు రామాలయాలు దర్శించు కొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జాటోత్ రమేష్, జెడ్పిటిసి సరోజన హరికిషన్, మండల పార్టీ అధ్యక్షుడు సంఘని సూరయ్య, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్ రావు, సర్పంచులు అనంతలక్ష్మి రవి, శ్రీధర్ నాయక్ ,కుమార్, శ్రీలత ప్రసాద్, సరిత తిరుమల్, మేడిద మానస శ్రావ ణ్, పెండ్లి స్రవంతి రవి, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : శ్రీరామనవమి సందర్భంగా గురువారం 14వ డివిజన్ ఏనుమాముల ఎన్టీఆర్ నగర్ లోని హనుమాన్ దేవాల యంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వేశాల పూర్ణ చందర్ దంపతులు, కాసర్ల రఘు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పుస్తెలుఅందజేశారు. కళ్యాణ మహౌత్సవం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యువసేన యూత్ సభ్యులు, గ్రామ అభివద్ధి కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : కోరి కొలిచే వారికీ కొంగు బంగారమైన శ్రీ సీత రాములోరి కళ్యాణం వేద పండితులు అంగరంగ వైబోవంగ నిర్వహించారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో వేద పండితులు ఆరుట్ల మాధవ మూర్తి పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణం తంతును నిర్వహించారు. ఈ వేడుకుల్లో రాష్ట్ర సర్పంచుల ఫోరం నాయకులు పర్వతగిరి రాజు మహేశ్వరి, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు తింగిలికర్ సత్యనారాయణ,వంగాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ పలకల మంజుల,బిఆర్ఎస్ నాయకులు వంగాల భగవాన్ రెడ్డి స్వాతి,మునుకుంట్ల సతీష్,పాపని రవీందర్, తదితరులు పాల్గొన్నారు. గూడెప్పాడ్ సీతారాముల దేవాల యంలో వేద పండితులు ఆరుట్ల కేశవా మూర్తి పర్యవేక్షణలో వేద పండితుల బందం కనుల పండుగగా కల్యాణ ఘట్టని నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ దంపతులు బీరం సునంద సుధాకర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ బీరం శ్రీలత,ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ బీరం రజినీకర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ జనగాం సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి గ్రామంలో సర్పంచ్ రంపిస మనోహర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో తంతును నిర్వహించారు. అక్కంపేటలోని శ్రీ సీతారాముల స్వామి దేవాలయంలో నిర్వ హించిన కల్యాణ వేడుకల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎన్క తాళ్ల రవీందర్,ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బొల్లబోయిన రాధా రవి యాదవ్ స్థానిక సర్పంచ్ ఎన్కతాళ్ల విజయ హంసాల్ రెడ్డి,లింగమడుగుపల్లె గ్రామంలో జరిగిన కల్యాణ వేడుకల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేముల నవీన్ దంపతులు,స్థానిక సర్పంచ్ జిల్లపెల్లి రాజేశ్వరి దంపతులు పెద్దాపురం రామాల యంలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ కక్కెర్ల రాధికా,స్థానిక సర్పంచ్ సావురే కమల,బిఆర్ఎస్ నాయకులు రాయరాకుల రవీందర్ బొల్లోజు కుమారస్వామి,గట్టు వేను దంపతుల,కక్కెర్ల సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి : శ్రీ రాములోరి కళ్యాణం వేద మంత్రాల నడుమ, భక్తజన సంద్రంలో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం మండల కేంద్రంలోని ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గలిగిన శ్రీ రాములవారి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయగా అర్చకులు రామకష్ణ చార్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి కళ్యాణం మహౌత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివద్ధికి, గ్రామంలో బొడ్రాయి స్థాపనకు 50 లక్షలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఏకతాటిపై నిలిచి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా సూచించారు. చరిత్ర కలిగిన ఆలయాలకు కేసీఆర్ ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. శ్రీ రాములవారి ఆలయాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య దంపతులు మంగళ వాయిద్యాలతో ముత్యాల తలంబ్రాలను దేవాలయానికి తీసుకువచ్చి స్వామివారికి సర్పించారు. గ్రామంలోని పుర ప్రముఖులు, ప్రజలు కళ్యాణ మహౌత్సవంలో పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో దాతలు బిల్లా సుధీర్ రెడ్డి, మల్యాల శ్రీనివాస్ రావు, ఆకుల సురేందర్ రావు, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎంపీటీసీలు బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, ఐత రాంచందర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఎండీ నయీమ్, మచ్చ సత్యం, నరసింహమూర్తి, సింహాద్రి, వేణు, సుధాకర్, రాము, అనిల్, మైస వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండల కేంద్రంలోని అశోక్ నగర్, మంగళివారిపేట, రంగాపురం, గ్రామాలలో శ్రీరామనవమి పం డుగను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహౌత్స వాలు ఘనంగా నిర్వహించారు.కళ్యాణ మహౌత్సవానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై సీతాదేవి పల్లకి మోశారు. అనంతరం ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు, జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట రామ నరసయ్య, సర్పంచులు, ఎంపిటిసి లు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ భాద్యులు, తదితరులు పాల్గొన్నారు.
సంగెం : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని దేవాలయాల వద్ద ప్రత్యేకంగా పందిర్లు వేసి,మామిడి తోరణా లతో సుందరంగా అలంకరించారు.ప్రజా ప్రతినిదులు సీతారా ముల కళ్యాణం కోసం పట్టువస్త్రాలు సమర్పించారు . మండలం లోని గవిచర్ల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకల పై రుపురెడ్డి వరుణ్ రెడ్డి కీర్తిరెడ్డి, కూర్చున్నారు.ఈ వేడుకలకు హై కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి లింగాల నర్సింహారెడ్డి హాజరై వేడుకలను తిలకించారు. అదేవిధంగా సంగెం మండల కేంద్రంలో ఎంపిపి కళావతి నరహరి,ఎంపిటిసి మల్లయ్య అనిత దంపతులు, రామచంద్రా పురంలో ఎంపిటిసి రజిత రాజు దంపతులు, కాట్రపల్లిలో సర్పంచ్ సాగర్ రెడ్డి,మనాలిని రెడ్డి దంపతులు, ఎంపీటీసీ గాయపు ప్రచూర్ణా భాస్కర్ రెడ్డి దంపతులు,గురుస్వామి గోగుల రాజేందర్ రెడ్డి, చింతలపల్లిలో శివాలయం చైర్మెన్ శ్రీనివాస్ శ్రీలత,సర్పంచ్ రవికుమార్ స్రవంతి, ఎంపిటిసి పావని యుగెందర్,వేద పండితుల అధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహౌత్సవం వేడుకల్లో పాల్గొన్నారు.కోట వెంకటాపురం గ్రామంలో రామాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో చైర్మన్ దంపతులు బాల శ్రీనివాస్ రెడ్డి మధురిమ, గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.అనంతర దేవాలయాల వద్ద దాతలు చొల్లేటి రవీంద్రప్రతాపరెడ్డి,బాల పిన్నారెడ్డి మమత సహకారంతో ఘనంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, నాయకులు దోనికెల శ్రీనివాస్, గాయకు హేలందర్ రెడ్డి,మాధవరెడ్డి,కర్ర రాజిరెడ్డి,చెవ్వ రమేష్,వనమారెడ్డి,సుధన్ రెడ్డి,సుందర సత్సంగ్ సభ్యులు వార్డు సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి : మండలంలోని ఆయా గ్రామాలలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో శ్రీరామ భక్తులు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి రాములోరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం ఆర్టీసీ కాలనీలో శ్రీరామ సేవా సమితి, పాత మార్కెట్ వీధిలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో, ఇందిరా కాలనీలో, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాలలో వేదమంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. రాముడి కళ్యాణాన్ని తిలికించేందుకు వర్దన్నపేట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ధనసరి సీతక్క, స్థానిక కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్, మాజీ కార్పోరేటర్ నాగమల్ల ఝాన్సీలక్ష్మీసురేష్, ఆత్మ చైర్మెన్ కందుకూరి చంద్రమోహన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మేకల హరిశంకర్, ముదిరాజ్ సంఘం నాయకుడు పిట్టల కుమారస్వామి, నాగమల్ల సంతోష్‌లు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశిస్సులు అందుకున్నారు. ఆయా గ్రామాలలో రాములోరి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిద పార్టీల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధుల రాకతో శ్రీరాములోరి కళ్యాణ మండపాలు కిక్కిరిసిపోయాయి. ఒక వైపు భక్తులు, మరో వైపు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగిపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసేవా సమితి భక్తులు, కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.