Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
బోల్లికొండ గ్రామ ప్రజల కోరిక మేరకు నాడు ఇచ్చిన హామీతో బోల్లికొండ సీ తారామాంజనేయస్వామి వారి గుట్ట వరకు రూ.2కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బొల్లికొండ గుట్ట నుండి నంద్యతండా వరకు రూ.2 కోట్లతో మంజూరైన బీటిరోడ్డు నిర్మాణ పనులకు గురు వారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రా ష్ట్రంలోని ప్రతి దేవాలయానికి మహర్దశ పట్టిందన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి పురాతనమైన, చరిత్రాత్మక ఆలయాలు కూడా అభివద్ధికి నోచుకున్నా యన్నారు. నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలోని గుట్టపై ఉన్న చారిత్రా త్మకమైన సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్లే మార్గం సరిగ్గా లేదని భక్తులు ఎన్నో ఇబ్బందులకు పడుతున్నారని గతంలో దేవాలయాన్ని సదర్శించిన ప్పుడు స్థానిక గ్రామస్తులు నాదృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే. గత పాలకులు కూడా ఈ గ్రామాన్ని, దేవాలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదనీ, ఆనాడు గ్రామస్థుల కోరిక మేరకు దేవాలయానికి వెళ్లే మార్గానికి నూతనంగా బిటి రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, గ్రామస్తుల ఇచ్చిన హా మీమేరకు బొల్లికొండ గుట్ట దగ్గర నుండి నంద్య తండా వరకు రూ.2 కోట్ల వ్య యంతో నూతనంగా నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చే సుకోవడం సంతోషదాయకమన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రా మ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేష్, జెడ్పిటిసి సరోజన హరికిషన్, మండల పార్టీ అధ్యక్షుడు సంఘని సూరయ్య, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు, బోల్లికొండ సర్పంచ్ శ్రీధర్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ సారం గపాణ,రాజిరెడ్డి, సోమయ్య, వీరస్వామి, గాదె భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.