Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లర్లకే పరిమితమైన పనులు - పట్టించుకునే వారెవరూ ?
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని దళిత కాలనీ లో నిర్మాణం చేపడుతున్న ఎస్సీ కమ్యూ నిటీ హాల్ భవన నిర్మాణం పనులు గత కొంతకాలంగా నిలిచిపోవడంతో పిల్లర్లకే పరిమితమైంది. దీని నిర్మాణం పూర్తయ్యే ది ఎప్పుడో అని కాలనీవాసులు ప్రశ్నిస్తు న్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి ఎస్సీ కమ్యూనిటీ భవనానికి రూ.25 లక్ష ల నిధులు మంజూరయ్యాయి. ఈ భవన నిర్మాణ పనులను వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి గత రెండేళ్ల క్రితం ప్రారంభించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్ల వరకు పనులను పూర్తిచేశారు. అప్పటినుండి ఇప్పటివరకు పనులు చేపట్టకపో వడంతో పిల్లర్లు దర్శనమిస్తున్నాయి. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణపనులు నత్తనడకన కొనసాగుతూ ఉండడంతో, కాల నీవాసులు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించి ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని త్వరగతిన పూర్తిచేసే దిశగా తగినచర్యలు తీసుకోవాలని కాలనీవాసు లు కోరుతున్నారు.
త్వరితగతిన నిర్మించాలి : మారపల్లి సుధాకర్, శాయంపేట
ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని త్వరితగతిన నిర్మించాలి. పనులు మొదలుపెట్టి రెండేళ్లు దగ్గర కావస్తున్న పిల్లర్లకే పరిమితమైంది. భవన నిర్మాణం పూర్తయితే సభలు, సమా వేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ తో కమ్యూనిటీ భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : శ్రీలత ఏఈ, పిఆర్
శాయంపేటలో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం పనులను కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపివేశారు. పలుమా ర్లు పనులు చేయాలని చెప్పినప్పటికీ వినటం లేదు. ఒక లెవల్ వర్క్ చేస్తే పేమెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ పట్టించు కోవడం లేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసు కెళ్లాం. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం.