Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరు నిజం..? ఎవరు అబద్ధం..!
- ముమ్మరంగా కొనసాగుతున్న లిక్కర్ దందా
- లబోదిబొమంటున్న మందుబాబులు
- ఉలుకు పలుకు లేని ఎక్సైజ్ సీఐ
నవతెలంగాణ-ఖానాపురం
రాష్ట్ర ప్రభుత్వం అబ్కారీ వ్యవస్థను పటిష్టం చేయడా నికి ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను మొదలుపెట్టి మద్యం అమ్మకాలపై నియంత్రణ కొనసాగిస్తున్న క్రమంలో మండ లంలోని బెల్టు షాపుల్లో నకిలీ ఆప్కారులు ఇష్టారీతిగా సో దాలు నిర్వహిస్తూ బాధిత కుటుంబ సభ్యులను అనేక ఇబ్బం దులకు గురి చేస్తున్న ఘటనలు మండలంలో కోకొల్లలుగా బయటపడుతున్నాయి.వివరాల్లోకి వెళితే మండలంలో మూ డు వైన్‌షాపులు ఉండగా వైన్ షాప్ నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి హోల్‌సేల్‌గా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి లి క్కర్ సీసాపై తమదైన శైలిలో స్టిక్కర్ వేసి క్వాటర్ సీసాపై రూ.15లు చొప్పున ఫుల్ బాటిల్‌పై రూ.60లు అదనంగా డబ్బులు దండుకుంటు మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్న క్రమంలో మద్యంపై అదనంగా వేస్తున్న ధరలపై మందుబాబులు లబోదిబోమంటున్న మండల అబ్కారీ అధి కారులు కళ్ళు మూసుకున్నట్లుగా వ్యవహరించడం మధ్యతర గతి ప్రజలను ఆలోచింపచేస్తుంది. వైన్‌షాపులు అబ్కారీ అధికారులకు అదనపు ఆదాయ వనరులుగా మారాయి.వైన్ షాపులు నిబంధనల అతిక్రమే అబ్కారీ అధికారుల జేబులు నింపుతున్నాయి. ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకులు బెల్టుషాపులో తనిఖీ నిర్వహించడానికి ప్రత్యేకమైన సిబ్బంది ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రతి రోజు అధికారుల వలె గ్రామాల్లో బెల్టు షాపులలో తనిఖీ చేస్తూ, అబ్కారీ అధికారు లకంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. నకిలీ అబ్కార్ల దుం దుడుకు తనంతో, బెల్ట్ షాపుల నిర్వాహకులతో పాటు వైన్ షాప్‌కు వెళ్లి మద్యం కొనుగోలు చేసే వారు కూడా అనేక అగ చాట్లకు గురవుతున్నారు. వైన్‌షాప్ నుండి తనిఖీ కోసం వ చ్చేవారు అసలైన అబ్కారులా? లేక నర్సంపేట అబ్కారీ కార్యాలయం నుండి వచ్చేవారు అసలైన అబ్కారులా? అనే విషయం తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నా రు. వైన్ షాప్ నిర్వాహకులు ప్రత్యేక అబ్కారీ వ్యవస్థను నడి పిస్తుంటే ఇక ప్రభుత్వ అబ్కారీ అధికారులు ఉండిఎందు కు ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగమంతా ప్రతిరోజు దశ్యమాలికల కనిపిస్తున్నప్పటికీ అబ్కారీ ఉన్నతాధికా రులు మామూళ్ల మత్తు నుండి బయటికి రాకపోవడం విడ్డూరం.
నకిలీ అబ్కారీ వ్యవస్థ గురించి అధిక ధరతో లిక్కర్ దంద నిర్వహిస్తున్న విషయాలపై నర్సంపేట అబ్కారీ సీఐ ప్రభుత్వ కేటాయించిన ఫోన్నెంబర్కి స్థానిక ప్రజలు పలు సార్లు ఫోన్ చేసిన సడిచప్పుడు ఉండడం లేదని తెలి పారు. ప్రజల సమాచారం గురించి అధికారులకు ప్రత్యేక ఫోన్ నెం బర్లు కేటాయిస్తే, వారు ప్రజల సమస్యలపై స్పందించకుం డా సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ప్రజలు దుయ్యబడుతున్నారు. లిక్కర్ దంద యదేచ్ఛగా నడుస్తున్న నర్సంపేట అబ్కారీవ్యవస్థ కార్యాలయానికి పరిమితం కావ డం పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలో జరు గుతున్న లిక్కర్ వ్యవహారం అబ్కారీ అధికారుల కనుసన్న ల్లోనే జరుగుతుందని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటు న్నారు. వైన్‌షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న అబ్కారీ అధికారులు కన్నెత్తిచూసిన దాఖలు లేవు. జిల్లా యంత్రాంగం నుండి మొదలు స్థానిక అబ్కారీ అధికారుల ప రిస్థితి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని స్థానికులు మనోభావన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నకిలీ అబ్కారీ వ్యవస్థను, అధిక ధరలకు మద్యంఅమ్మకాలను పూర్తిస్థాయిలో నియం త్రించాలని ప్రజలు వేడుకుంటున్నాను.