Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని కార్పోరేషన్ అధికారులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రజాప్రతినిధుల అలక్ష్యం...అధికారుల పట్టింపులేని తనం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజలకుశాపంగా మారింది. ప్ర ణాళికబద్దమైన పనుల నిర్వహణ లేక కోట్ల రూపాయల ప్ర జాధనం పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్ల జేబులు నిం డుతున్నాయన్న ఆరోపణలకు నిదర్శనం జయగిరి రోడ్డు ని ర్మాణ పనులను చూస్తే ఇట్టే అర్థమవుతుందని ఇరు గ్రామా ల ప్రజలు ఆరోపిస్తున్నారు. హసన్‌పర్తి బస్టాండు నుంచి ఇ టీవల నిర్మించిన బీటీ రోడ్డు పనులు డబుల్ స్ట్రంత్తో నిర్వ హించినట్లు ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఆ రో డ్డు నిర్మాణ పనులుచేసి గడువుకాలం ముగియకముందే హ సన్పర్తి నుంచి జయగిరి మీదుగా అనంతసాగర్, మడి పల్లి కుడా లేఅవుట్ వరకు రోడ్డు నిర్మాణ పనుల కోసం తిరి గి టెండర్లు వేసి బీటీరోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో డ బుల్ స్ట్రంత్రోడ్డు కోసం చేసిన పనులు గడువు కాలం ముగి యకముందే పూర్తిగా దెబ్బతిన్నవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికి గతంలో నిర్మించిన డబుల్ స్ట్రంత్ పనులకు ఎటువంటి మేయింటెనెన్స్ చేయని సంబంధిత కాంట్రా క్టర్‌పై చర్యలు తీసుకోకుండా తిరిగి మళ్లీ బీటీ రోడ్డు పనుల కు టెండర్లు వేసి వేసిన రోడ్డుకే మళ్లీ రోడ్డు వేస్తూ కోట్ల రూ పాయల ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతు న్న పాల కులు, అధికారుల పనితీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతు న్నాయి. ప్రణాళికాబద్దంగా హసన్‌ప ర్తి నుంచి జ యగిరిరోడ్డు మీద నిత్యంక్రషర్, గ్రానే ట్లోడు లా రీలు ఓవర్‌లోడుతో రాకపోకలు సాగి స్తుంటాయి. అయితే ఈ రోడ్డు వెంట దెబ్బతిన్న కల్వర్టులకు పునరుద్దరణ పనులు చేపట్టడం లేదా నూతనంగా కల్వర్టులు నిర్మించడం చేయాల్సి ఉంది. ఇవేమి పట్టించుకోని సంబందిత అర్అండ్బీ అధికారు లు తూ..తూ.. మంత్రంగా బీటీ రోడ్డు పనులు చేసి చేతులు దులుపుకోవడంతో ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్న క్ర షర్, గ్రానేట్ లారీలతో అనంతికాలంలోనే బీటీ రోడ్డు దెబ్బతిని ఇరుగ్రామాల ప్రజలు రాకపోకలు సాగించ డానికి ఇబ్బం దులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేస్తున్నా రు. అంతేకాకుండా గతంలో హసన్‌పర్తి బస్టాండులో కార్పో రేషన్ ఫండ్‌తో నాణ్యమైన సీసీరోడ్డు వేసి ఓవర్‌లోడ్ లారీల తో రోడ్డు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతం టెండర్ తీ సుకున్న కాంట్రాక్టర్ నాణ్యమైన సీసీ రోడ్డును పెకిలించడం తో మిషన్ భగీరథ పైపులైన్ పూర్తిగా దెబ్బతిని తాగునీరు వృథాగాపోతోంది. అయితే ఈ తాగునీటి వృథా వల్ల నూత నంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ముగియక ముందే తిరిగి దెబ్బతినే పరిస్థితి ఉందని స్థానికులు మండి పడుతున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు పనులవల్ల మిషన్ భగీరథ పైపు లైన్ దెబ్బతిని కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు గడువు ముగియకముందే దెబ్బతినే ప్రమాదముం దని స్థాని క ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన మిషన్ భగీ రథ పైపులైన్ ద్వంసం చేసిన సదరు కాంట్రా క్టర్‌పై కార్పో రేషన్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకో వాలని, అంతేకాకుండా హసన్‌పర్తి నుంచి జయగిరి వరకు పురాతన కల్వర్టులకు ఎస్టిమేషన్ వేసి కొత్త కల్వర్టులు నిర్మించాలని, ప్రస్తుతం వేస్తున్న బీటీ రోడ్డు డబుల్ స్ట్రంత్తో టెండర్లు వేసి నాణ్యమైన రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.