Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రారాములు
నవతెలంగాణ-హన్మకొండ
రోడ్డు ప్రమాదంలో మృతిచెం దిన వ్యవసాయ కూలీల కుటుంబాల కు రూ.25 లక్షల బీమా ప్రకటించి వారికుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని బీకేఎంయు జాతీయ కార్యవ ర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రా ములు డిమాండ్ చేశారు. జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన వ్యవసాయ కూలీలు బు ధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇ ద్దరు మృతి చెందడం, పలువురు క్షత గాత్రులు కావడం అత్యంత బాధాకర మన్నారు. ప్రమాదంలో కాలు విరిగి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొం దుతున్న పసుల బిక్షపతిని గురువా రం పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీ పనులతో పొట్టపోసుకునే నిరుపేదలైన వ్యవసాయ కూలీ లువారి గ్రామంలో ఉపాధిలేక రేగొండ మండలం పోచంపల్లికి మిరపకాయలు ఏరడానికి ఆటోలో 14 మంది వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గు రై కొంగరి చేరా లు, దుబాసి కోమల ప్రాణాలు కోల్పోయారని పలువురు కూలీలు కాళ్లు, చేతులు విరిగి క్షతగాత్రులై ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారన్నారు . వ్యవ సాయ కూలీలప్రాణాలకు భద్రతలేకుండా పోయిందని ఉన్న ఊళ్లో ఉపాధి లేక ఇతరప్రాంతాలకు వెళ్తుంటే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్న నివారించేందుకు చర్యలు చేపట్టక పోవడం సిగ్గుచేటన్నారు.
గత సంవత్సరం ఇదేగ్రామానికి చెంది న నలుగురు కూలీలు మరణించారని అంతకుముందు ఆత్మకూరులో నలుగురు కూలీలు మరణించారని రాష్ట్రవ్యా ప్తంగా ఇలాంటి దుర్ఘటనలు జరిగి కూలీల కు టుంబాలు దిక్కులేనివై పోతున్నా యని ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్రమైన వ్యవసా య కార్మిక చట్టాన్ని పొందిం చాలన్నారు.మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల సహాయం అందించాలని భవిష్యత్తులో ఇలాం టి ఘటనలు జరగ కుండా చర్యలు చేపట్టాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు.