Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, వా టిని అధిగమించడానికి ఆధ్యాత్మికత అల వర్చుకోవాలని, ఆధ్యాత్మికతతోనే మానస ిక ప్రశాంతత లభిస్తుందని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి అ న్నారు. మండలంలోని గట్లకానీపర్తి గ్రా మంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పుర స్కరించుకొని శివాలయంలో కో-ఆప్షన్ సభ్యులు గుర్రం అశోక్ సంధ్యారాణి, ఆడేపు రమేష్ సరస్వతి దంపతులు అంగరంగ వైభవంగా సీతారామ చంద్రస్వామి కళ్యాణ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరు కాగా, ఆలయ అర్చకులు గూడ వాసుదేవ మూర్తి పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. ఆలయానికి కాంపౌండ్‌వాల్, కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎ మ్మెల్సీని కోరగా స్పందించిన మధుసూదనాచారి తన నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయ ణరెడ్డి, ఎంపీటీసీ బత్తిని రజని సత్యనారాయణ, పిఎసిఎస్ డైరెక్టర్ గుర్రం రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.