Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్న భూ కబ్జాదారులు
- సీపీ ఆఫీసులో రౌడీషీటర్లే ఫిర్యాదు చేస్తున్న వైనం
- తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపట్ల చర్య లేవి ?
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నుండి వరంగల్ నగరం అ త్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ తర్వాత వరంగల్ కు వివిధ దేశాల నుండి అనేకమైన పరిశ్ర మలు రావడం వల్ల వరంగల్‌లో భూములకు మంచి గిరాకీ ఉంటుంది. అందువల్ల కొంతమంది భూకబ్జాదారులు, రౌడీ షీటర్లు ఒక ముఠాగా ఏర్పడి నిత్యం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్తూ పోలీసులను మచ్చికచేసుకొని ఖాళీగా ఉన్న జాగలపై, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు నివాస స్థలాలకు కోసం కొనుక్కున్న భూములపై కన్నేసి నగరం నడిబొడ్డున భూ అక్రమనలు రోజురోజుకు పెట్రేగిపోతున్నా యనీ పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం పోలీస్‌కమిషనర్ ఏవి రంగనా థ్ విధుల పట్ల బాధ్యతతో వుంటూ నేరాలను అరికట్టడంలో పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తూ బాధితులకు అండ గా ఉండి బాధితులకు న్యాయం చేస్తూ ఇప్పటికీ ఒక ప్రత్యేక తను చాటుకుంటున్నారు. వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఏవీ రంగనాథ్ నియామకమైన వెంటనే మొదటిసారిగా తమ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడం వలన నగర ప్రజలకు పోలీస్ కమిషన ర్ ఏవీ రంగనాథ్ పట్ల పూర్తి నమ్మకం కలిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.
నగరంలోభూకబ్జాదారులుపెట్రేగిపోగుతున్న క్రమంలో కమిషనర్ ప్రత్యేక చొరవతో ఫిర్యాదు చేసిన వారిపట్ల కొంత సానుభూతి చూపిస్తూ అక్రమంగా భూకబ్జాలు చేసిన వారిని పిలిపించి పోలీసువిచారణ అధికారికి అప్పజెప్పి, క్షు ణ్ణంగా విచారణ చేసి, నిజమైన భూ యజమానులకు అండ గా ఉండి భూ కబ్జాదారుల పైన కేసులు పెట్టి జైల్లోకి పంపిం చిన సంఘటనలు లేకపోలేదు. కానీ కొంతమంది రౌడీషీట ర్లు భూకబ్జాదారులు సైతం ఇదే తడువుగా భావించి భూము లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు పైన ఫిర్యాదులు చేసిన సంఘటనలు లేకపోలేదు. విచారణ అధికారులు క్షేత్ర స్థాయిలో డాక్యుమెంట్స్ పరిశీలించిన తరువాత భూకబ్జాదా రులైన రౌడీషీటర్లు తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మూలంగా లోతుగా వారి నేరచరిత్రను తెలుసు కొని ఫిర్యాదు చేసిన వా రి పట్ల కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ విచారణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించకపోతే అసలుదారులైన భూయజమానులకు ఇబ్బం దులు కలిగేవ ని, క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అసలైన వారికి న్యాయం జరి గేది కాదేమో అని పలువురు చర్చించుకుంటున్నారు ఏదేమై నప్పటికీ భూకబ్జాదారుల్లో గుండెల్లో గుబులు గుబులు అవు తున్నదని పలువురు చర్చించుకుంటున్నారు.
భూకబ్జాదారులవేటలో టాస్క్ ఫోర్స్ అధికారులు
ఇటీవల భూకబ్జాదారులనే ఆరోపణలు ఎదుర్కుం టున్న పలువురిని టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకువెల్లి వి చారణ చేయడం క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఫిర్యాదు చేస ిన వారిలో కూడా నేరం రుజువైతే వారిపట్ల కూడా కఠిన వైఖ రిని అవలంభిస్తున్నరనే సమాచారం. అందువల్ల రాజకీయ నాయకులు కార్పొరేటర్లలో కార్యాలయాల్లో, హౌటల్లో, గ్రం థాలయాల్లో వంటి పలు ప్రాంతాల్లో ఎక్కడ ఇద్దరు, ముగ్గు రు కలిస్తే భూఅక్రమదారులను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ రోజు ఎవరిని పిలుస్తారో రేపు ఎవరిని పిలుస్తారో అనే చర్చ విపరీతంగా సాగుతుంది .ఏదిఏమైనాప్పటికీ అసలుదారుల కు న్యాయం జరిగడం, భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవ డం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూ డా అధికార పార్టీ చెందిన కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీకి చెంది న కార్పొరేటర్‌ను సైతం విడువకుండా వారు చేసే భూ కబ్జా లను నివారించేందుకు చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులు మొత్తం చెల్లిస్తామని కొంత భయానగా డ బ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు లేకపోలేదు చాలా ఏళ్ళ నుండి డబ్బులు ఇవ్వాలని అడిగి విసిగి వేసారి పోయిన బాధితులు ఉన్నారని పలువురు గుసగుసలాడు కుంటున్నా రు. కొంతమంది తమకు అన్యాయం జరిగిందని అసలైన భూ యజమానులు సిపి ఆఫీసులో ఫిర్యాదు చేయడం లేదు కానీ భూకబ్జా దారులు రౌడీషీటర్లు మాత్రం సిపి కి ఫిర్యాదు చేయడానికిఆసక్తి చూపుతున్నారని పలువురు అనుకుంటు న్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీస్ ఉన్నత అధికారులు నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరూ బాధితులు కాదని, వారిపట్ల అప్రమత్తంగా ఉండి, నిజమైన భూమి యజమాను లకు న్యా యం చేయాలని పలువురు చర్చించుకుం టున్నారు. లేకపో తే భూకబ్జాలు చేసిన వారే ఫిర్యాదులు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారని వినికిడి.
ఏది ఏమైనప్పటికీ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తీసుకుంటున్న చర్యల పట్ల అసలైన భూమి యజ మానులకు భూములు ఇచ్చి అండగా ఉన్నందుకు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వరంగల్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఏవి రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లో ప్రజల గుం డెల్లో నిలిచిపోయారు.న్యాయం జరిగిన బాధితులు ఇటీవల పాలాభిషేకాలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఏది ఏమైనప్పటికి మధ్యతరగతి ప్రజలు భూకబ్జా దారుల్లో ఒత్తిల్లో ఉండకుండా అసలైన భూ యజమానులు ఫిర్యాదులు చేసేటట్లు చూడాలని,అసలైన భూ యజమా న్యాలపై కక్ష సాధింపు చర్యలతో భూకబ్జాదారులు రౌడీష ీటర్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారి పై పోలీస్ అధికా రులు కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని పలు వురు అనుకుంటున్నారు.